మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ పట్టణంలోని పలు ఆస్పత్రులను డీహెంహెచ్వో కళావతి బాయి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మైత్రి, లక్ష్మి, చిన్న పిల్లల ఆస్పత్రి, మన్మోహన్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఆమె పరిశీలించారు. ఇందులో భాగంగా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులను స్కానింగ్ చేయాలన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని వివరించారు. ప్రతి హాస్పిటల్ మేనేజ్మెంట్ ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. పట్టణంలో అనుమతి లేని చిన్నారి పిల్లల హాస్పిటల్, మన్మోహన్ రెడ్డి మల్టీస్పెషాల్టీ హాస్పిటల్ ను గుర్తించి నోటీసులు అందజేశారు. వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.