- తనిఖీలతో క్లోజ్ చేసి డీఎంహెచ్ఓ
జనగామ, వెలుగు : రూల్స్‌కు విరుద్ధంగా క్లినికల్ల్యాబ్ను నిర్వహిస్తుండగా జనగామ మెడికల్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో మై ల్యాబ్పేరిట ఓపెన్ చేసి రక్త పరీక్షలు, స్కానింగ్, ఈసీజీ, ఎక్స్‌రేతో పాటు సుమారు 100 రకాల టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డీఎంహెచ్ వో మల్లికార్జున్‌రావు సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్ కింద పర్మిషన్స్ తీసుకోకుండా టెస్టులు చేస్తున్నట్టు తేలడంతో వెంటనే ల్యాబ్‌ను సీజ్ చేశారు. పర్మిషన్స్లేకుండా ల్యాబ్‌లు, హాస్పిటల్స్, డెంటల్, పాలీ, ఫిజియో థెరపీ క్లినిక్ లు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ ఓ హెచ్చరించారు. ఆయన వెంట ప్రభాకర్, హెల్త్ అసిస్టెంట్పేర్వారం ప్రభాకర్ ఉన్నారు.