
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి వివాహానికి భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్ కలిసి పోజులిచ్చారు . ఈ వివాహానికి హాజరు కావడానికి ధోని, గంభీర్ డెహ్రాడూన్ వెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పంత్ నేరుగా తన సోదరి వివాహానికి హాజరయ్యాడు. ధోనీ, గంభీర్ ఇద్దరూ కలిసి పంత్, అతని సోదరి, ఆమె భర్తతో కలిసి ఫోటోకు ఫోజులిచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ధోనీ, గంభీర్ బ్యాయట కలుసుకోవడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలో గమనించాల్సిన విషయం ఏంటంటే ధోని మోర్స్ కోడ్ ప్రింట్ ఉన్న నల్ల టీ-షర్టు ధరించగా.. గంభీర్ జీన్స్,నల్ల టీ-షర్టు ధరించాడు. పంత్ సాంప్రాదాయ దుస్తుల్లో కనిపించాడు. పంత్ సోదరి వివాహానికి ధోనీ మంగళవారం (మార్చి 12).. హాజరు కాగా.. గంభీర్ బుధవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2013 లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోగా.. ఇటీవలే దుబాయ్ వేదికగా గంభీర్ హెడ్ కోచ్ గా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది.
Also Read :- WTC ఫైనల్కు అర్హత సాధించని ఇండియా
గంభీర్, ధోనీ ఇద్దరూ కలిసి 2011 వన్డే వరల్డ్ కప్ లో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గంభీర్ 97 పరుగులు చేస్తే ధోనీ 91 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఫైనల్ తర్వాత ధోనీ, గంభీర్ మధ్య వివాదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. గంభీర్ పరోక్షంగా ధోనీపై విమర్శలు చేశారు. మరోవైపు ధోనీ కూడా గంభీర్ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ ఒకే చోట కలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
MS Dhoni and Gautam Gambhir at Rishabh Pant's sister's wedding. ⭐ pic.twitter.com/mPFmTHattP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2025