టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni)కి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో అందరికీ విధితమే. ఏదైనా వాహనం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. కొత్త మోడల్ నుంచి వింటేజ్ మోడల్ వరకూ ఏదైనా తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అలా అని వాటిని కొని దాస్తాడనుకోకండి. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వాటిని బయటకి తీసి రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. తాజాగా ధోని 1973 నాటి పాంటియాక్ ట్రాన్స్ కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
MS Dhoni driving 1973 Pontiac Trans Am SD-455 in Ranchi. pic.twitter.com/LQANMJXWwg
— Johns. (@CricCrazyJohns) July 31, 2023
కొద్దిరోజుల క్రితం భారత మాజీ దిగ్గజం వెంకటేష్ ప్రసాద్.. ధోని గ్యారేజీ దృశ్యాలను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. వందకు పైగా బైకులు, పదుల సంఖ్యలో కార్లతో మహేంద్రుడి గ్యారేజీ.. షోరూమ్‌నే తలపించింది. అన్ని కార్లు ఉన్నా.. ధోని తిరుగుతూ కనిపించిన సందర్భాలు తక్కువని అభిమానులు నిట్టూర్చారు. ఆ మాటలు అతని చెవిని పడ్డాయేమో కానీ, వింటేజ్ కార్లను ఒక్కొక్కటిగా బయటకి తీస్తున్నారు.
One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house.
— Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023
Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz