
చెన్నై: లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో సీఎస్కేకు సూపర్ ఫ్యాన్‌గా ఉన్న రామదాస్ అనే వ్యక్తికి సంతకం చేసిన తన జెర్సీని బహుమతిగా అందించాడు. వందేండ్ల వయసులోనూ సీఎస్కే, ధోనీపై చూపిస్తున్న అభిమానం గురించి రామదాస్ చెప్పిన ఓ వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. విషయం తెలుసుకున్న మహీ ‘మీ సపోర్ట్‌కు థ్యాంక్స్ తాత’ అని రాసి సంతకం చేసిన జెర్సీని సీఎస్కే ఫ్రాంచైజీ రామదాస్‌కు అందించింది.