ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది

మ‌హేంద్ర సింగ్ ధోని..క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కెప్టెన్ గా ఎన్నో రికార్డులు.. మరెన్నో పతకాలు. ధోని కోసమే క్రికెట్ చూసే వాళ్లు లక్షల్లో ఉంటారు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని..ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. కాగా.. ఎప్పుడు వార్తల్లో ఉండే ధోని.. ఈసారి తన స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుటిక‌ప్పుడూ ట్రెండీ లుక్ ను ఫాలో అయ్యే ధోని.. ఈ నయా లుక్ లో పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2022 ప్ర‌మోషన్ లో భాగంగా  స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను రూపొందించింది. ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్, కళ్లద్దాలు, పెద్ద పెద్ద మీసాలు, మెడలో కర్చీఫ్, చేతిలో మైక్ తో ఉన్న ధోని ఊర మాస్ లుక్.. అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఈ కొత్త గెటప్ లో అచ్చం చెన్నై బస్ డ్రైవర్ లా కనిపిస్తున్న ధోనిని అభిమానులు మొదట గుర్తుపట్టలేదు. గుర్తు పట్టాకా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పిక్చర్లే కనిపిస్తున్నాయి. 

 

 

మరిన్ని వార్తల కోసం:

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్