ధోనీ మాయాజాలం.. కళ్లు మూసి తెరిచే లోపే స్టంప్.. అదే కదా మహీ స్పెషల్

ధోనీ మాయాజాలం..  కళ్లు మూసి తెరిచే లోపే స్టంప్.. అదే కదా మహీ స్పెషల్

చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ మ్యాచ్ లో RCB కి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ధోనీ మెరుపువేగంతో స్టంప్ చేయడంతో ఫస్ట్ వికెట్ పడింది. రెప్ప మూసీ తెరిచే లోపే.. ఏం జరిగిందని బ్యాట్స్ మెన్ అంచనా వేయలేని స్తితిలో అత్యంత వేగంగా.. ఫ్రాక్షన్ సెకండ్ లో స్టంప్ ఔట్ చేశాడు ధోని.  ఫోర్లు, సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతున్న ఓపెనర్ ఫిలఫ్ సాల్ట్ ను రెప్పపాటులోనే ఔట్ చేసి పంపించేశాడు. 

పవర్ ప్లేలో 16 బాల్స్ ఆడిన సాల్ట్.. 5 ఫోర్లు, 1 సిక్స్ తో 32 స్కోర్ దగ్గర ఔటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. నూర్ వేసిన ఫుల్ లెంత్ బాల్ మిస్ అయ్యి ధోనీ చేతిలో పడటం.. వెంటనే స్టంప్ చేయడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయాయి. ధోనీ మాయాజాలానికి నోరెళ్లబెట్టడం  ఫ్యాన్స్  వంతు అయ్యిందంటే అతిశయోక్తి కాదు. 

వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే.. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది బ్యాట్స్ మెన్. క్రీజ్ లోనే ఉన్నాలే అనుకుంటే ధోనీ ఎలా షాక్ ఇస్తాడో ఈ మ్యాచ్ లో సాల్ట్ కు తెలిసొచ్చింది. ఇలాంటి అద్భుతాలు చేయడంలో ధోనీ ఎప్పుడూ స్పెషలే అంటున్నారు ఫ్యాన్స్.