DC vs CSK: ఇదెక్కడి ఆనందం రా బాబు: చెన్నై ఓడినా పండగ చేసుకున్న ఫ్యాన్స్

DC vs CSK: ఇదెక్కడి ఆనందం రా బాబు: చెన్నై ఓడినా పండగ చేసుకున్న ఫ్యాన్స్

అభిమానుల్లో చెన్నై అభిమానాలు వేరయా.. నిన్న(మార్చి 31) మ్యాచ్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 20 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చెన్నైకిదే తొలి ఓటమి. సాధారణంగా ఫేవరేట్ జట్టు ఓడిపోతే బాధపడతారు. కానీ  చెన్నై ఫ్యాన్స్ మాత్రం సంతోషంలో తేలిపోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణం చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మెరుపులు మెరిపించడమే. 

ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయాలను సాధించింది. అయితే ధోనీ బ్యాటింగ్ చూడాలనుకున్న అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. దీంతో ఓ వైపు చెన్నై విజయాలు సాధిస్తున్న ధోనీ బ్యాటింగ్ చూడలేకపోయామనే వెలితి ఫ్యాన్స్ లో అలాగే ఉంది. అయితే నిన్న ధోనీ బ్యాటింగ్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై ఓడిపోతుందనే బాధను కూడా ఫ్యాన్స్ మర్చిపోయారు. ఓ వైపు మాహీ బౌండరీల వర్షం కురిపిస్తుంటే గెలుపోటములు మాకు సంబంధమే లేదన్నట్లుగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 

చివరి ఓవర్లో విజయానికి 41 పరుగులు అవసరం కాగా.. నోకియా వేసిన ఈ ఓవర్లో ధోనీ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. మొత్తం 20 పరుగులు రాబట్టి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. తొలి బంతినే బౌండరీతో మొదలు పెట్టిన ధోనీ.. మొత్తం 16 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 37 పరుగులుచేసి అజేయంగా నిలిచాడు. 42 ఏళ్ళ వయసులు కూడా ధోనీ తన విశ్వ రూపాన్ని చూపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

Also Read: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిది?

             
విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్  ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నై 171 పరుగులకే  పరిమితమైంది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.