వైడ్ బాల్‌కు ఔటేంది.. క్రికెట్ గురించి నీకు ఏం తెలుసు..?: ధోనీని ప్రశ్నించిన సాక్షి

ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్‌‌లో తనదైన ముద్ర వేశాడు. ఎందరో యువ క్రికెటర్లతో పాటు అప్ కమింగ్ యంగ్ స్టార్స్ కు ఆయన రోల్ మోడల్. యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాల సృష్టించడం అతని నైజం. సాధారణ బౌలర్లతోనూ అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతనికి అలవాటు. కాలక్రమేణా ఆ మార్పులతో ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా నిలిపాడు. దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. 

కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించిన మహేంద్రుడు.. బ్యాటర్ గా వికెట్ కీపర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా వికెట్ కీపింగ్ లో ధోనీ పనితనం అసాధారణం. మహీ వికెట్ల వెనకాల ఉంటే బ్యాటర్  దాటాలంటే భయపడతాడు. మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. అలాంటి ధోనీకి అతని భార్య సాక్షి కీపింగ్ గురించి ఒక వింత సందేహాన్ని ధోనీని అడిగిందట. ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ ఈ విషయాన్నీ స్వయంగా చెప్పకొచ్చాడు. 

"సాక్షితో కలిసి నేను ఒక మ్యాచ్ చూస్తున్నాను. బహుశా వన్డే మ్యాచ్ అనుకుంటా. మాములుగా నేను, సాక్షి క్రికెట్ గురించి మాట్లాడుకోము. కానీ ఒకరోజు బౌలర్ వైడ్ వేసి బ్యాటర్ ను స్టంపౌట్ చేశాడు. అంపైర్లు థర్డ్ అంపైర్ కు ఇవ్వగా 'ఇది నాట్ అవుట్' అని నా భార్య చెప్పింది. బ్యాటర్ ఔటని డగౌట్ కు బయలుదేరాడు.  

ALSO READ | Sanju Samson: సంజు శాంసన్‌కు నేను పెద్ద అభిమానిని: భారత మాజీ స్టార్ క్రికెటర్

అప్పుడు 'నా భార్య అది నాటౌట్.. వైడ్ బాల్ కు స్టంపౌట్ ఎలా చేస్తారు'. అని చెప్పింది. దానికి నేను వైడ్ బాల్ కు స్టంపౌట్ ఉంటుంది. నో బాల్ అయితే అది సాధ్యపడదు. అని చెప్పాను. దానికి సాక్షి మీకేం తెలుసు అంపైర్లు మళ్ళీ బ్యాటర్ ను వెనక్కి పిలుస్తారు చూడు అని చెప్పింది. ఆ తర్వాత అంపైర్లు ఔట్ అని ప్రకటించగానే... నా భార్య సాక్షి ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పింది". అని ధోనీ తన భార్యతో జరిగిన అనుభవాన్ని పంచుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు తెగ నవ్వుకున్నారు.