ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ధోనీ!

ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ధోనీ!

చెన్నై: మోచేతి గాయంతో బాధపడుతున్న సీఎస్కే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో జరిగే లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఎంఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ మరోసారి చెన్నై జట్టును నడిపించే అవకాశం ఉంది. ఆదివారం (April 5) గువాహటిలో 
రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ మోచేతికి గాయమైంది. 

‘రుతురాజ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేస్తాడని భావిస్తున్నాం. మోచేతి నొప్పి ఇంకా తగ్గలేదు. రోజు గడిచేకొద్ది కాస్త తగ్గుతూ వస్తుంది. కాబట్టి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ వరకు కోలుకుంటాడని ఆశిస్తున్నాం. కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు’ అని సీఎస్కే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ మైక్‌‌‌‌‌‌‌‌ హస్సీ వెల్లడించాడు.