జార్ఖండ్ విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ గ‌రం గ‌రం

జార్ఖండ్ విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ గ‌రం గ‌రం

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సంక్షోభానికి కారణమేంటని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా ఏళ్లుగా జార్ఖండ్‌ ఎందుకు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ ట్యాక్స్ పేయ‌ర్‌గా అడుగుతున్నానని ప్రశ్నించారు. క‌రెంట్ ఆదా చేయ‌డానికి ‘మా వంతు కృషి మేం చేస్తూనే ఉన్నాం.. అయినా.. ఎందుకీ విద్యుత్ సంక్షోభ‌ం..?’ అని సాక్షి నిలదీశారు. ప్రస్తుతం సాక్షి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరచూ సాక్షి ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. 

జార్ఖండ్ లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 28వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రాష్ట్రంలో బొగ్గు కొరత కారణంగా ఏర్పడ్డ విద్యుత్ సంక్షోభం, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ధోని సతీమణి సాక్షి తమ కూతురుతో కలిసి రాంచీలోనే ఉంటున్నారు. మరోవైపు ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  

మరిన్ని వార్తల కోసం..

మూడు టిమ్స్ ఆస్పత్రులకు భూమి పూజ చేయనున్న కేసీఆర్

ఏడువారాల జాతరకు  ఏర్పాట్లు ఏవీ..? 

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌తో మాట్లాడుతాం