- కలర్ ఫుల్ కైట్స్.. మస్త్ క్రేజ్
- సిటీలో పతంగుల పండుగ షురూ
- పిల్లలు, యూత్ ఫుల్ ఎంజాయ్
- తయారీకి ధూల్‌పేట చాలా ఫేమస్
- 2 నెలల ముందుగానే కైట్స్ మేకింగ్
- లోకల్ పతంగులు, మాంజాకు ఫుల్గిరాకీ
హైదరాబాద్, వెలుగు: సంకాంత్రి వస్తుందంటే సిటీలో పతంగులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. వాటిని ఎగరవేస్తూ, కీంచ్ కట్ చేస్తూ పిల్లలు, యువకులు మస్త్ఎంజాయ్ చేస్తుంటారు. పతంగుల తయారీకి ధూల్‌పేట చాలా ఫేమస్. వివిధ డిజైన్లలో కలర్ ఫుల్ పతంగులను రూపొందిస్తుంటారు. అయితే.. లోకల్ పతంగులు, మాంజాను కొనేందుకు సిటీ నుంచే కాకుండా తెలంగాణలోని జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కైట్ లవర్స్ వస్తుంటారు. ధూల్‌పేట లో హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలవుతుంది. పండగ సమీపిస్తుందంటే.. ధూల్‌పేటతో పాటు సిటీ అంతటా కలర్ ఫుల్ పతంగులు షాపుల్లో కనువిందు చేస్తుంటాయి.
లోకల్ కైట్.. మాంజాకు క్రేజ్
ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని రకాల పతంగులు వచ్చినా.. ధూల్‌పేట పేపర్పతంగులు, మాంజాకు ఉండే క్రేజే వేరు. ఇక్కడ కవర్, పేపర్, క్లాత్ పతంగులు అమ్ముతారు. వీటిలో కవర్ పతంగులు యూపీ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ల నుంచి, క్లాత్ పతంగులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. పేపర్పతంగులు మాత్రం ధూల్‌పేటలోనే తయారవుతాయి. దిగుమతి చేసుకునే పతంగులు క్వాలిటీగా ఉండవు. లోకల్పేపర్ పతంగులు మాత్రం క్వాలిటీ, థ్రెడ్‌ను కలిగి ఉంటాయి. దీంతో కస్టమర్లు లోకల్పేపర్ కైట్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. పేపర్పతంగి ధర రూ. 10 నుంచి రూ. 100 ఆపైన దొరుకుతాయి. ప్రభుత్వం చైనా మాంజాను బ్యాన్చేయడంతో లోకల్మాంజాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ధూల్‌పేట్ మార్కెట్‌లో ప్రధానంగా బరేలీ, గన్, కృష్ణ, సంకల్ప్మాంజాలు అందుబాటులో ఉండగా.. వీటిలో కృష్ణ సంకల్ప్మాంజాలు లోకల్‌గానే తయారు చేస్తారు.
సీజనల్పండుగలకు అడ్డా..
వినాయక చవితి, దసరా, దుర్గామాత, దీపావళికి పటాకులు, రాఖీ పౌర్ణమి, సంక్రాంతికి పతంగులు ఇలా.. పండుగేదైనా దానికి సంబంధించిన విగ్రహాలు, వస్తువులు దొరికేది మాత్రం ధూల్‌పేటలోనే. ఆయా సీజన్లలో ముడి సరుకు తెచ్చుకొని అక్కడి వ్యాపారులు ఇండ్లలోనే పతంగులు, రాఖీలు, విగ్రహాలు తయారు చేస్తుంటారు.
సైజులను బట్టి ధరలు
ట్రెండింగ్యూనిక్ పతంగులు ధూల్‌పేటలో అందుబాటులో ఉన్నాయి. రకరకాల సైజుల్లో కవర్, పేపర్, క్లాత్పతంగులు, ఆర్డీనరీ మంజా నుంచి క్వాలిటీ మాంజా దాకా అందుబాటులో లభిస్తాయి. వాటి సైజులను బట్టి ధరలు ఉంటాయి. 21 సెం.మీ కవర్ పతంగుల బెండల్‌లో 160 పీసులు ఉంటాయి. లో 160 పీసులు ఉంటాయి. దాని ధర రూపాయలు. 42 సెంమీ పతంగీల బెండల్ 100 పతంగులకు 1,230 రూపాయలు. పేపర్ పతంగులు ఒక్కోటి రూ. 10 నుంచిమొదలై వందల రూపాయలు, క్లాత్ పతంగులు 100 నుంచి వేలల్లో ఉన్నాయి.
రూ. లక్షల్లో హోల్‌సేల్ బిజినెస్
ప్రతి సీజన్‌లో లక్షల్లో బిజినెస్అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు మూడు నెలల నుంచే వివిధ జిల్లాలు, సమీప రాష్ట్రాల వ్యాపారులు పతంగులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారని పేర్కొన్నారు. సంక్రాంతి సమయానికి ధూల్‌పేటలో దాదాపు 300 దాకా పతంగులు షాపులు ఉంటాయని, ప్రతి దాంట్లో వేల పతంగులు అమ్ముడవుతాయని, లక్షల బిజినెస్ జరుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం అమ్మకాలు నడుస్తున్నాయి
ప్రతి ఏడాది రెండు నెలల ముందు నుంచే ఆర్డర్లు వస్తాయి. పేపర్పతంగులను మేమే తయారు చేస్తాం. ప్లాస్టిక్ కవర్, క్లాత్ పతంగులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ సీజన్‌లో ముడి సరకు ధరలు పెరిగాయి. దీంతో పతంగుల ధరలు కూడా పెంచాల్సి వచ్చింది. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా బిజినెస్ బాగుంటుందని అనుకుంటున్నా.
- మహాదేవ్ సింగ్, భవాని ఎంటర్ప్రైజెస్, ధూల్‌పేట