నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ధూం ధాం దోస్తాన్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ను సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లొకేషన్‌లో చిత్రీకరించారు. నాని అండ్ టీం ధూం ధాం స్టెప్పులతో దుమ్ము లేపుతున్నారు.
తెలంగాణలోని రామగుండం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ అలరించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 మార్చి 30న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.