![ధూం ధాం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2024/03/dhoom-dham-movie-first-look-poster-release_GtxFbWRC70.jpg)
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయి కిశోర్ మచ్చ దర్శకత్వంలో ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షూటింగ్ లొకేషన్‌లో రిలీజ్ చేశారు. పెండ్లి బారాత్‌లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న కలర్‌ఫుల్ స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, గోపరాజు రమణ బెనర్జీ, ప్రవీణ్, గిరిధర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కని లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.