గేమ్ ఛేంజర్ నుంచి దోప్ సాంగ్ విడుదల..

గేమ్ ఛేంజర్ నుంచి దోప్ సాంగ్ విడుదల..

టాలీవుడ్ ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులోభాగంగా శనివారం అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలేజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు వచ్చారు. సినిమాకి విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సరే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపుగా  ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు ఈ సినిమాలోని దోప్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 

ఈ పాటని ప్రముఖ ఫేమస్ సింగర్స్, రోషిణి జెకెవి, పృధ్వి & శృతి రంజని మోదుముడి  తదితరులు పాడగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తెలుగు ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్స్ తో దో దో లిరిక్స్ తో మొదలయ్యే ఈ పాట ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. అలాగే సాంగ్ రిలీజ్ అయిన గంట వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

ఈ విషయం ఇలా ఉండగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ జోనర్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాని ప్యాన్ ఇండియాతోపాటూ ఓవర్సీస్ లో ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 29న గేమ్ చెంజర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.