IPL Retention 2025: అదృష్టం అంటే ఇతనిదే.. ఏడాదిలో 70 రెట్లు పెరిగిన ఐపీఎల్ జీతం

IPL Retention 2025: అదృష్టం అంటే ఇతనిదే.. ఏడాదిలో 70 రెట్లు పెరిగిన ఐపీఎల్ జీతం

ఐపీఎల్ అంటేనే ఆటగాళ్లకు కాసుల పండగ. ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా సంపాదించలేని డబ్బు ఒక్క ఐపీఎల్ ద్వారా సంపాదించుకోవచ్చు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లు తమ ప్రతిభ నిరూపించుకుంటే ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి ఫ్రాంచైజీలు వెనుకాడరు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కావడంతో ఈ సారి ఎవరు కోట్లు కొల్లగొడతారో ఆసక్తి నెలకొంది. అయితే అంతకంటే ముందు రిటెన్షన్ లో ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్లను వారికి స్థాయికి తగ్గట్టు కోట్లు పెట్టి తీసుకున్నారు. 2024 ఐపీఎల్ తో పోలిస్తే అందరి శాలరీ పెరిగింది. అయితే అందరికంటే ఎక్కువగా ఎవరు ఎక్కువ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. 

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లో సన్ రైజర్స్ ఆటగాడు హెన్రిక్ క్లాసన్ కు అత్యధికంగా రూ. 23 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ. 21 కోట్లతో తమ జట్లతో కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే.. 2024 తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్ ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాడు. అతనికి ఏకంగా రాజస్థాన్ యాజమాన్యం రూ.14 కోట్లు ఇచ్చి తీసుకుంది. 2024 ఐపీఎల్ లో జురెల్ కేవలం రూ. 20 లక్షల రూపాయలతో జట్టులో ఉన్నాడు. కానీ 2025 లో మాత్రం అతనికి ఏకంగా రూ. 14 కోట్ల రూపాయలు దక్కాయి. 

వికెట్ కీపర్ బ్యాటర్ గా జురెల్ రాజస్థాన్ జట్టులో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. టీమిండియా టెస్ట్ జట్టులోనో చోటు సంపాదించి తనను తాను నిరూపించుకున్నాడు. భవిష్యత్ లో భారత టీ20 జట్టులో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే జురెల్ కు ఇంత భారీ మొత్తంలో ఇచ్చినట్టు తెలుస్తుంది. జురెల్ తో పాటు రింకూ సింగ్, మతీష పతిరానా, మయాంక్ యాదవ్ లు కూడా 2024 లో  కోటి రూపాయల కంటే తక్కువ శాలరీతో గా వచ్చి 10 కోట్లకు పైగా తమ తమ జట్లలో కొనసాగనున్నారు.