Duleep Trophy 2024: 20 ఏళ్ళ ధోనీ రికార్డ్ సమం చేసిన జురెల్

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ఎ తరపున ఆడుతున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. ఈ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో జురెల్ ఏకంగా 7 క్యాచ్ లు అందుకోవడం విశేషం. 2004 సీజన్ లో ధోనీ ఈస్ట్ జోన్ తరపున 7 క్యాచ్ లు అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో జురెల్ వరుసగా నాలుగు క్యాచ్ లందుకున్నాడు. మూడో రోజు తర్వాత మొత్తం ఆరు వికెట్లలో ఐదు క్యాచ్ లు అందుకున్న జురెల్.. నాలుగో రోజు మరో రెండు క్యాచ్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ఆకాష్ దీప్ నిప్పులు చేరడగడంతో ప్రతి క్యాచ్ వెళ్లి వికెట్ కీపర్ జురెల్ చేతిలో పడింది. వీటిలో ముషీర్ ఖాన్ క్యాచ్ అద్భుత రీతిలో జురెల్ అందుకోవడం విశేషం. లెగ్ సైడ్ కు దూరంగా వెళ్తున్న బంతిని అతను చాలా దూరం కవర్ చేసి డైవ్ చేసి అందుకోవడం విశేషం. ముషీర్ తో పాటు జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్,సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, సాయి కిషోర్ నవదీప్ సైనీ క్యాచ్ లు జురెల్ అందుకున్నాడు. క్యాచ్ లు పట్టినా.. బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫమమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 

ALSO READ | Duleep Trophy 2024: కెప్టెన్‌గా గిల్‌కు పరాభవం.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓటమి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా–బి తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులకు ఆలౌటైంది. జట్టు చేసిన 321 పరుగుల్లో ఒక్కడే 181 పరుగులు చేయడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ 231 పరుగులు మాత్రమే చేయగలిగింది. 90 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  ఇండియా-బి 184 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-ఏ 198 పరుగులకే ఆలౌటైంది.