ఫామ్ లో ఉన్నా టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టం. సర్ఫరాజ్ ఖాన్ దీనికి ప్రధాన ఉదాహరణ. దేశంలో పరుగుల వరద పారిస్తున్నా చాలా రోజులు జట్టులో స్థానం కోసం ఎదురు చూడక తప్పలేదు. సీనియర్ క్రికెటర్లు పుజారా, రహానే,ఉమేష్ యాదవ్ లది ఇదే పరిస్థితి. ఫామ్ లో ఉన్నా వీరిని కరుణించేవారు లేరు. అయితే ఈ విషయంలో తెలుగు కుర్రాడు కేయస్ భరత్ అదృష్టవంతుడనే చెప్పాలి. పంత్ యాక్స్ డెంట్, కిషాన్ వ్యక్తిగత కారణాల వలన దూరం కావడంతో భరత్ ఇంకా జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే..తాజాగా ఈ తెలుగు కుర్రాడిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తుంది. నివేదికల ప్రకారం భరత్ బ్యాటింగ్ తో పాటు కీపింగ్ గొప్పగా లేదని.. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం లేదని బీసీసీఐ లోని ఒక వర్గం తెలిపింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన జురెల్ ప్రతిభావంతుడు. మంచి భవిష్యత్తును కలిగి ఉన్నాడు.అతను ఉత్తరప్రదేశ్, ఇండియా ఎ, రాజస్థాన్ రాయల్స్‌కు బాగా రాణించాడు. రాజ్‌కోట్‌లో జురెల్ తన అరంగేట్రం చేసినా ఆశ్చర్యపోవద్దు. అనివెల్లడించారు. దీంతో మూడు టెస్టుకు భరత్ స్థానంలో జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపు ఖరారైంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భరత్ 23 యావరేజ్ తో 92 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్ గా 7 టెస్టుల్లో 20 యావరేజ్ తో 221 పరుగులు చేసి జట్టుకు భారమయ్యాడు. ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ ను కూడా చేరుకోలేపోయాడు. లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్ ల్లో 5,23 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరోవైపు 22 ఏళ్ల జురెల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 46.47 సగటుతో 790 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత నెలలో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌పై 50 రన్స్.. డిసెంబర్‌లో బెనోనిలో దక్షిణాఫ్రికా Aపై 69 రన్స్ చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 న జరుగుతుంది.
Dhruv Jurel likely to make his Test debut in Rajkot by replacing KS Bharat??? (TOI) pic.twitter.com/TAwQqngMro
— CricketGully (@thecricketgully) February 12, 2024