వరుసగా నాలుగు బౌండరీలు కొట్టడం పెద్ద కష్టం కాదు.. వరుసగా నాలుగు వికెట్లు తీయడం అరుదుగా చూడొచ్చు. కానీ వరుసగా నాలుగు క్యాచ్ లంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. అలాంటి అరుదైన సంఘటన ఒకటి దులీప్ ట్రోఫీలో జరిగింది. ఇండియా-ఏ తరపున ఆడుతున్న జురెల్.. ఇండియా-బి జట్టుపై వరుసగా నాలుగు క్యాచ్ లందుకున్నాడు. మొత్తం ఆరు వికెట్లలో ఐదు క్యాచ్ లు జురెల్ అందుకోవడం విశేషం.
ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ఆకాష్ దీప్ నిప్పులు చేరడగడంతో ప్రతి క్యాచ్ వెళ్లి వికెట్ కీపర్ జురెల్ చేతిలో పడింది. వీటిలో ముషీర్ ఖాన్ క్యాచ్ అద్భుత రీతిలో జురెల్ అందుకోవడం విశేషం. లెగ్ సైడ్ కు దూరంగా వెళ్తున్న బంతిని అతను చాలా దూరం కవర్ చేసి డైవ్ చేసి అందుకోవడం విశేషం. ముషీర్ తో పాటు జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్,సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి క్యాచ్ లు జురెల్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో ఇండియా-బి బ్యాటింగ్ లో విఫలమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యం కలుపుకొని 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు ఇండియా-బి 321 పరుగులకు ఆలౌట్ కాగా..ఇండియా-ఏ 231 పరుగులకు పరిమితమైంది.
I.C.Y.M.I
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
Dhruv Jurel pulled off another stunner to dismiss the last innings centurion Musheer Khan 👌👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/6w5THkZElW