తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాయల వెంకటేశ్వర్లు, బండి నాగేశ్వరావు, ఉదారి యాదగిరి, ముషం సత్యనారాయణ, కొట్టు శేఖర్, సింగారపు వెంకన్న, కొండా లింగారావు, కర్నే కృష్ణ, నందిగామ ముక్కంటి తదితరులు  పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషిచేయాలి

మునగాల, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేయాలని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకుడు శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకురాలు గంధం జానకమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు మల్లన్నను గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించాలని కోరారు.