
- శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిన రోళ్లగడ్డ
గుండాల, వెలుగు: మండల పరిధిలోని రోళ్లగడ్డ పంచాయతీలో ఈసం వంశీయుల ఆధ్వర్యంలో రెండురోజులుగా దూల్ గొండ తల్లి జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు రాష్ట్ర నలు మూలాల నుంచి ఈసం వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం దేవుడిగుట్టనుంచి దూల్ గొండ తల్లిని గిరిజన పూజారులు డప్పు వాయిద్యా లు, శివసత్తుల పూనకాల నడుమ తీసుకొచ్చారు. రాత్రి జనంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపో యింది.
డప్పు చప్పుళ్లతో రోళ్లగడ్డ మార్మోగింది. మేడారం జాతర తరువాత జిల్లాలో ఇదే అతి పెద్ద జాతరని ఈసం వంశీయులు చెబుతున్నారు. శుక్రవారంతో జాతర ముగియనుంది. వనదేవత అడవి నుంచి వస్తుండగా భక్తులు కోళ్లు, మేకలను కోశారు. జాతర వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రవీందర్, ఎస్సై రాజమౌళి గట్టి బందోబస్తు నిర్వహించారు. జాతరలో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి 108 వాహనాన్ని జాతర ప్రాంగణంలోనే ఉంచారు. జాతర సందర్భాంగా నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడలు కొనసా గుతున్నాయి. తల్లికి ఈసం వంశీయులు రామ్మూ ర్తి. ఈసం పాపారావు,కృష్ణ, నర్సింహరావు, నారాయణ, నారాయణరావు, కృష్ణ, వెంకటనారాయణ, పగడయ్య, ఆలయ కమిటీ సభ్యులు, వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు.