Dia Mirza: రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్.. మీడియా క్షమాపణ చెప్పాలని నటి దియా మీర్జా డిమాండ్

Dia Mirza: రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్.. మీడియా క్షమాపణ చెప్పాలని నటి దియా మీర్జా డిమాండ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ మరణంలో ఎటువంటి కుట్ర కోణం లేదని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శనివారం మార్చి 22న ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అలాగే.. సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. 

దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మరియు సోదరుడు షోయిక్ చక్రవర్తి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. సీబీఐ కేసును ముగించడంతో, చాలా మంది ప్రముఖులు రియాకు అనుకూలంగా ముందుకు వచ్చారు.

ALSO READ | Actress Attacked:హైదరాబాద్ హోటల్ గదిలో బాలీవుడ్ నటిపై దాడి  

ఈ క్రమంలో రియా చక్రవర్తికి మద్దతుగా నటి దియా మీర్జా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబానికి లిఖితపూర్వక క్షమాపణ చెప్పే దయ మీడియాలో ఎవరికి ఉంటుంది? మీరు మంత్రగత్తెల వేటకు వెళ్లారు. మీరు TRPల కోసం తీవ్ర వేదన మరియు వేధింపులకు కారణమయ్యారు. క్షమించండి. మీరు చేయగలిగేది అదే." అంటూ దియా మీర్జా తనదైన శైలిలో స్టోరీలో రాశారు.    

ఈ విషయంపై క్లీన్ చిట్ రియా తర్వాత చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనేషిండే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రియాను ప్రశంసించారు. 

"మౌనంగా ఉండి, వారిపై జరిగిన అమానవీయ చికిత్సను అనుభవించినందుకు రియాను మరియు ఆమె కుటుంబాన్ని అభినందిస్తున్నాను. ఎటువంటి తప్పు చేయకపోయినా, బెయిల్ మంజూరు చేయడానికి ముందు రియా 27 రోజులు జైలులో గడిపారని ఆయన నొక్కి చెప్పారు. అమాయకులను వెంటాడి, మీడియా మరియు దర్యాప్తు సంస్థల ముందు ఊరేగించారు. ఇలాంటి అన్యాయం పునరావృతం కాకూడదని నేను ఆశిస్తున్నాను. మీడియా నిర్ణయాధికారులు తమ చర్యల గురించి ఆలోచించాలని నేను కోరుతున్నాను." అంటూ న్యాయవాది సతీష్ మనేషిండే వెల్లడించారు. 

కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ జూన్ 14,2020న ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాలీవుడ్‌ స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న సుశాంత్ మరణం బాలీవుడ్‎తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సుశాంత్ మరణం వెనక పొలిటిషన్స్‎తో పాటు బాలీవుడ్ మాఫియా ఉందని ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలోనే నటి రియా చక్రవర్తి, ఇతరులు కలిసి సుశాంత్‎ను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి  కెకె సింగ్ పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ నటి రియా  చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది.