
పొద్దున్నే లేవడంతోనే కొంతమంది పొట్టలో ఏం పడేద్దామా అని చూస్తుంటారు. డయాబెటిస్ ఉన్న వాళ్లు కొద్దిగా ఆలోచిస్తారు.. అయినా జిహ్వ చాపల్యం ఆగదు కదా..! బతికినంత కాలం బతుకుతాం.. ఏదో ఒకటి తిందాంలే అని లాగించేస్తుంటారు. అలాంటి వారికి రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్దాలను తెలుసుకుందాం. . .
డయాబెటిస్.. మధుమేహం.. అదే నండి షుగర్... ఈ వ్యాధి వచ్చిదంటే డైట్ కంట్రోల్ మస్ట్.. ఎక్సర్ సైజ్చేయకపోతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే పొద్దున్నే లేవడంతోనే పరగడుపున కొన్ని పదార్దాలను తింటే షగర్ కంట్రోల్ లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క: దీనికి బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గించే లక్షణాలుంటాయి. పరగడుపున దాల్చిన చెక్క నీళ్లలో మిరియాల పొడిని కలుపుకొని తాగితే షుగర్ కంట్రోల్ తో పాటు బీపీ కూడా తగ్గుతుంది. పెరుగు, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయని వైద్య నిపుణలు అంటున్నారు.
మెంతులు: పోపులపెట్టెలో ఉండే ముఖ్యమైన ఐటం. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను అదుపుచేస్తుంది. రోజు రాత్రి కొద్దిగా మెంతులను నీళ్లలో నానబెట్టి పొద్దున్నే పరగడుపున తింటే ఇట్టే షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు గ్యాస్టిక్ ట్రబుల్ .. కడపులో మంటతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం.
Also Read :- ఎండాకాలంలో ఈ ఫుడ్ తినకపోతేనే మంచిది
అవిసె గింజలు: వీటిలో ఒమేగా కొవ్వు ఆమ్లాలు.. ఫైబర్ కంటెంట్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీళ్లలో కలుపుకొని స్మూతీతో కలిపి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. వీటిలో ఫైబర్ కార్బొహైడ్రేడ్లు జీర్ణక్రియను వృద్ది చేస్తాయి.
టమోటాలు... దానిమ్మ గింజలు: ఈ రెండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు.. విటమిన్లు.. ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. టమోటాలలో ఉండే లైకోపీస్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దానిమ్మ రసం బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. పొద్దున్నే టమాటా రసం తాగినా.. దానిమ్మ గింజలను తిన్నా.. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటామి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.