షుగర్ పేషంట్లకు.. అశోకా చెట్టుకు ఉన్న లింక్ ఏంటీ..

మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో  సంప్రదాయ ఆచారాలు... పద్దతులకు  ఎంతో విలువ ఇస్తారు.  హిందూ గ్రంధాల్లో అశోక చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  అశోక వృక్షాలు ఉన్న ఇళ్లు  శాంతి, శ్రేయస్సు ఆనందం కలిగి ఉంటాయని భావిస్తారు.  ఈ చెట్టు ఆకులను ఔషధంగా ఉపయోగించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతాయని చెబుతారు. ఆయుర్వేదం అశోక వృక్షాన్ని వివిధ ప్రయోజనాలతో కూడిన ఔషధ మొక్కగా పరిగణిస్తుంది. అశోక చెట్టు ని బెరడు డయాబెటిస్‌ను నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అందులో ఎన్నో రకాల వైద్యగుణాలున్నాయని తెలుపుతున్నారు. అయితే షుగర్ తో పాటు ఇంకా అనేక రకాల వ్యాధుల బారి నుంచి అశోక చెట్టు చాలా ఉపయోగంఅంటున్నారు వైద్య నిపుణులు.  అశోక చెట్టు వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. . . 

డయాబెటిస్ ప్రాణాంతకరమైన వ్యాధి. రక్తంలో షుగర్‌ స్థాయి పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జీవనశైలిలో మార్పుల వల్ల ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల   డయాబెటిస్ తీవ్రత పెరుగుతుందని వైద్యులు తెలిపారు. అయితే దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిండం వల్ల త్వరగానే  విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే ఆహారంతోనే షుగర్‌ను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

అశోక చెట్టు బెరడులో మేలు

అశోక  చెట్టు బెరడు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ చర్యను పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. అయితే  దీనిని డాక్టర్ సలహాతో మాత్రమే ఉపయోగించాలి. అశోకుడి చెట్టు బెరడును పౌడర్‌గా తయారు చేసుకొని.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ అదుపులోకి వచ్చేందుకు చాలా మంది  వేప చెట్టు బెరడును ఉపయోగిస్తారు. అయితే అశోక చెట్టు బెరడుతో పాటు వేప బెరడును కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండింటినీ పొడిగా తయారు చేసి వాడవచ్చని నిపుణులు తెలిపారు. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఖచ్చితంగా విముక్తి పొందవచ్చు. బెరడుతోనే కాకుండా పుష్పాలతోనూ కూడా డయాబెటిస్ నియంత్రించవచ్చట. పూలను రోజూ తినడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం పొందడమే కాకుండా.. ఇలా నిత్యం చేయడం వల్ల బ్లడ్‌లోని షుగర్ స్థాయి కూడా అదుపులోకి వస్తుంది. చూర్ణం చేసిన అశోక పువ్వులతో కొన్ని చుక్కల నీటిని తీసుకోవడం అంతర్గత రక్తస్రావం నుండి నివారణ చర్యగా నమ్ముతారు. రక్తస్రావ విరేచనాలను నివారించడంలో కూడా ఈ పువ్వులు ప్రయోజనకరంగా ఉంటాయి. 

Also Read :- ఇలా తింటే.. రోగాలు లేకుండా 100 ఏళ్లు బతుకుతారు

అశోక చెట్టు ఆకులు, బెరడు   చర్మ సంబంధిత చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుంది.  మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులున్న వారికి ఇది మంచి ఉపయోగకారిగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  అశోక చెట్టు నుండి తీసుకోబడిన హెర్బల్ సప్లిమెంట్స్ పైల్స్ చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటాయి, చెట్టు బెరడు నుండి తయారు చేసిన కషాయాలు ముఖ్యంగా అంతర్గత పైల్స్ చికిత్సకు సహాయపడతాయి.

అశోక చెట్టు ఆకులను పేస్ట్ చేసి  జాయింట్ పెయిన్స్ ఉన్న చోట మర్దన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.   ముఖంపై ముడతలు, మొటిమలు తగ్గించడంలో కూడా ఈ చూర్ణం ఉపయోగపడుతుంది.  అశోక వృక్షం బెరడు, ఆకులను ఎండబెట్టి పొడిచేసుకొని  గోరు వెచ్చని నీటిలో తీసుకుంటే   గర్భాశయ కండరాలు , ఎండోమెట్రియంను ప్రభావితం చేసే సామర్థ్యం రెట్టింపు అవుతుంది.  ఇంకా కడుపు నొప్పి , క్రమరహిత ఋతు చక్రాలు, అమెనోరియా, ల్యుకోరియా, ఫైబ్రాయిడ్లు, వంటి రుగ్మతలతో సహా మహిళల్లో వివిధ స్త్రీ జననేంద్రియ సమస్యల చికిత్సలో ఇది చాలా మంచిగా పనిచేస్తుందని చెబుతున్నారు.