మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర పదార్థాలను తినకూడదు. కానీ పండ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మధుమేహం ఉన్నవారు కొన్ని పండ్లను తినకూడదు. ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాం.
మనం తినే చాలా రకాల పండ్లు చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారం అవసరం. ఇందులో ముఖ్యంగా పండ్లు, జ్యూస్ లు, డ్రైఫ్రూట్స్ వంటి కొన్ని పండ్లు తీసుకుంటే వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చక్కెర స్థాయిలు పెరగనీయని పండ్లను తీసుకుకోవాలి. ఈ ఆహారంలో పండ్లను, ఆహారాలను ఎంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్పైకింగ్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. చాలా పండ్లలో చక్కర ఎక్కువగా ఉంటుంది. కానీ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ముఖ్యంగా ఉంటాయి. అన్ని పండ్లు బలాన్నిచ్చేవే కానీ అందులోని గుణాల కారణంగా మన ఆరోగ్యాలకు సరిపోకపోవచ్చు. అధిక చక్కెర కంటెంట్ ఉండే పండ్లు ఏవంటే.....
మామిడి : మామిడిని పండ్లను రారాజుగా పిలుస్తారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి పండు కాదు. అధిక మొత్తంలో సహజ చక్కెరను కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా తినాలి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఫోలేట్ ఉంటుంది, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ... చర్మ సంరక్షణకు అద్భుతమైనవి. అయితే, మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మామిడి పండ్లను తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రాక్ష: ఈ పండ్లలో ఫ్రక్టోజ్ అని పిలువబడే ఒక రకమైన చక్కెర ఉంటుంది. శరీరం ఫ్రక్టోజ్‌ను నెమ్మదిగా గ్రహిస్తుంది. కాబట్టి ద్రాక్ష పండ్లు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరగవు. నిదానంగా పెరుగుతాయి. మధుమేహం ఉన్నప్పుడు, శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. . ఫలితంగా,రక్తంలో షుగర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది. కాలక్రమేణా, అధిక రక్తంలో చక్కెర స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి మరియు కంటి సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
చెర్రీస్ : మధుమేహ వ్యాధిగ్రస్తులు - చెర్రీస్ పండును మితంగా తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఈ రుచికరమైన పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరుగుతుంది. మరియు గ్లూకోజ్‌ని పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి.... బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్లు, ఎ మరియు సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
అరటిపండ్లు : అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మళ్లీ ఆ చక్కెర స్థాయిలు తగ్గాలంటే.. వాడే మందులకు లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేకుంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 , విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి... గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అయితే అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
పైనాపిల్: పైనాపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడంతో రోజుకి 100 గ్రాముల కంటే ఎక్కువ పైనాపిల్ తినకూడదు. అంతకంటే ఎక్కువగా పైనాపిల్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా అది శరీరంలోని ఇతర అవయవాలపైన ప్రభావాన్ని చూపించి, కిడ్నీలు కళ్ళు, గుండె వంటి శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైనాపిల్ లో గ్లైసిమిక్ ఒకవేళ డయాబెటిస్ బాధితులు దీనిని ఎక్కువ తింటే అది శరీరంలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం
తక్కువ షుగర్ కంటెంట్ ఉండే పండ్లు
పియర్ (బేరి పండ్లు) : తెలుగు రాష్ట్రాల్లో అధికంగా లభించే పండ్లలో పియర్ ఒకటి(Pears). ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి కూడా మంచిది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న బేరిపండ్లను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ పండు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండులో విటమిన్ బి , విటమిన్ కె, మినరల్స్, పొటాషియం, ఫినాలిక్ సమ్మేళనాలు, ఫోలేట్, ఫైబర్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం ఉన్నాయి. పియర్ రుచి ఒగరు, తీపి, రుచిలతో రుచికరంగా ఉంటుంది. విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండులో కేలరీలు చాలా తక్కువ. ఈ పండును చిరుతిండిగా తీసుకోవచ్చు. పోషకాహార నిపుణులు సలహా కూడా ఇదే, బేరిని తినడం ద్వారా స్థూలకాయాన్ని వేగంగా నియంత్రించవచ్చు.
అవోకాడో : అవకాడోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిక్ సిండ్రోమ్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు రోజూ అల్పాహారంలో అవకాడో తీసుకోవడం వల్ల మీ షుగర్ స్థాయి పెరగదు. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిన చక్కెర స్థాయిని సరైన స్థాయికి తీసుకురాగలవు. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.అవకాడోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
స్ట్రాబెర్రీలు :ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన బెర్రీ పండు. స్ట్రాబెర్రీలు తీపి రుచిని కలిగి ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధి గ్రస్తులకు స్ట్రాబెర్రీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
బ్లాక్ బెర్రీస్ (నేరడి పండు) : ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు.. డయాబెటిస్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండ్లలో తక్కువ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫైబర్, విటమిన్లు మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి తక్కువ కేలరీలు, ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ కారణంగానే ఈ నేరడి పండ్లను తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
కివి : ఈ పండు తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. మీరు దీన్ని మీ సలాడ్‌లలో యాడ్ చేసుకోవచ్చు. కివిలో విటమిన్లు సి, కె, ఇ, యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం అధికంగా ఉన్నాయి. ఈ పండ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
బొప్పాయి : డయాబెటిస్ పేషెంట్లు పచ్చి బొప్పాయిని తింటేనే మంచిది. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో షుగర్ తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కొవ్వు కంటెంట్ తక్కువగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ పచ్చి, వండిన బొప్పాయి రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, డయాబెటిస్ ఉన్నవారి మొత్తం ఆరోగ్యానికి మంచి చేస్తాయి. బొప్పాయిలు మలబద్దకానికి గ్రేట్ గా సహాయపడుతాయి, జీర్ణక్రియలో సహాయపడతాయి, సెల్ డ్యామేజ్‌ని నివారిస్తాయి మరియు చర్మానికి అద్భుతమైనవి. వాటిలో అధిక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫైబర్ ఉన్నాయి. ఇందులో తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది.