కరోనా సాకుతో అడ్డగొలుగా దోచుకుంటున్న డయోగ్నోస్టిక్ సెంటర్లు

వరంగల్ మహనగరంలో కరోనా విక్నెస్ తో డయోగ్నోస్టిక్ సెంటర్ లు అడ్డగొలుగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిపాటి జర్వం, దగ్గ వచ్చినా హాస్పిటల్స్ కి పరుగులు పెడుతున్నారు జనం. దీంతో పొడి దగ్గు, జ్వరం ఉందని చెబితే… హెచ్ ఆర్ సిటీ స్కానింగ్ తీసుకుని రావాని…. డాక్టర్లే  డయాగ్నోస్టిక్ సెంటర్ పేరును సూచిస్తూనట్లు చెబుతున్నారు. స్కానింగ్ కి వెళితే.. 2, 3 వేల రూపాయలు వసూల్ చేస్తున్నారని… రోగులు చెబుతున్నారు. హెచ్ ఆర్ సిసీ స్కానింగ్ కు ఐదు వేల ఐదు వందల నుండి నుంచి ఆరువేల రూపాయల వరకు తీసుకుంటురనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరంగల్  లోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో…. ఓపీకి రెండు వందల నుంచి మూడు వందల వరకు తీసుకునేవి. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కొక్కిరికి 400 నుంచి 500 వరకు వసూల్ చేస్తున్నరని రోగులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లకు మాత్రం హెచ్ ఆర్ సీటీ స్కానింగ్  తీసుకుంటేనే రోగులను ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. ఫీజుల దందాపై వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు ఏరోజు తనిఖీలు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

స్కానింగ్  సెంటర్  లో 4వేల500 నుంచి 5వేలు తీసుకుని స్కానింగ్  చేసినట్లు బాధితులు చెబుతున్నారు. స్కాన్ లో నెగిటివ్ రావడంతో ఆస్పత్రికి వెళ్లితే.. డాక్టర్ 500 రూపాయలు తీసుకుని ఓపీ చేశారని చెబుతున్నారు. నెల రోజుల పాటు కష్టపడి పైసా పైసా కూడబెట్టితే ఒక్క రోజే పైసలు అన్ని ఖర్చు అయ్యాయని వాపోతున్నారు. బైట్ : శ్రీనువాస్, హన్మకొండ. MGM హాస్పిటల్ లో కరోనా రోగులకు సరిగ్గా వైద్యం అందకనే.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినట్లుగా రోగులు చెబతున్నారు. ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆస్తులు, ఆభరణాలు అమ్ముకుని వైద్యం చేయించుకుంటున్నామని కరోనా బాధితులు బంధువులు వాపోతున్నారు.

ప్రైవేటు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ల లో ప్రభుత్వ రూల్స్ లెక్కచేయకుండా అధిక ఫిజులు వసూల్ చేస్తున్నట్లు స్ధానికులు చెబుతున్నారు. ఇటు వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎంఐఆర్ సీ రూల్స్ ప్రకామే ఫీజులు తీసుకోవాలని చెబుతున్నారు జిల్లా వైద్యధికారీ డాక్టర్ మోహన్ రావు. అధిక ఫీజులు వసూల్ చేస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఫీజులు వసూల్ చేస్తున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.