విజయవాడను పీడిస్తున్న డయేరియా.. ఐదుగురు మృతి..

మానవ శరీరానికి నీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు సమస్యలు పుష్కలంగా నీరు తాగడం వల్ల అధిగమించచ్చు. అయితే, మనం తాగే నీరు శుభ్రంగా లేకపోతే అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కలుషిత నీటి వల్ల ఎక్కువగా వచ్చే సమస్యం డయేరియా. ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫయర్ లేదా మినరల్ వాటర్ వినియోగం తప్పనిసరి అయిన ఈరోజుల్లో డయేరియా గురించి అరుదుగా వింటున్నప్పటికీ అప్పుడప్పుడు కలుషిత నీటి వల్ల డయేరియా వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇటీవల విజయవాడలో కలుషిత నీటి సమస్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కలుషిత నీటి కారణంగా డయేరియా వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా డయేరియా వల్ల ఐదుగురు మృతి చెందారని, 100మందికి పైగా బాధితులు ఉన్నారని సమాచారం అందుతోంది. డయేరియా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. నీటిలో నైట్రేట్ మోతాదు అధికంగా ఉండటమే కారణమని అధికారులు అంటున్నారు. నీటిని పరీక్ష కోసం ల్యాబ్ కి పంపిన అధికారులు రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.