
నోయిడా: ఢిల్లీ శివారులోని నోయిడా సెక్టార్ 94లో రెడ్ కలర్ లాంబోర్ఘిని కారు ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు కార్మికుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడే ఉన్న ఒకరు కారు డోర్ తీసి వీడియో రికార్డ్ చేస్తూ ‘‘నువ్వు స్టంట్స్ నేర్చుకుంటున్నావా..? ఇక్కడ ఎంతమంది చనిపోయారో నీకు తెలుసా..? ఏంటీ ర్యా్ష్ డ్రైవింగ్ ?’’ అని నిలదీశారు. ఆ డ్రైవర్ ఎంత బలుపుతో సమాధానం ఇచ్చాడంటే.. ‘‘ఇప్పుడిక్కడ ఎవరైనా చచ్చారా..? ఎవరూ చచ్చిపోలేదు కదా..?’’ అని నిర్లక్ష్యపూరితంగా మాట్లాడాడు.
#WATCH | Noida, Uttar Pradesh: Two people were injured after being hit by a Lamborghini car near Sector 94 roundabout in Sector-126 police station area. The car is registered in the name of Mridul and was being driven by Deepak. The driver, Deepak, a resident of Ajmer, has been… pic.twitter.com/F8iL6O1QtS
— ANI (@ANI) March 30, 2025
దీంతో.. ఆ వీడియో రికార్డ్ చేసిన అతను ఎవరైనా పోలీసులను పిలవండని కేకలేశాడు. ఈ మాటలతో భయపడిన డ్రైవర్.. నేను ఎక్సలరేటర్ను నెమ్మదిగా ప్రెస్ చేశానని సమాధానమిచ్చాడు. ‘‘ఎక్సలరేటర్ను నెమ్మదిగా ప్రెస్ చేశావా..? నిదానంగా వెళ్లుంటే ఇలా జరిగేదా..?’’ అని వీడియో రికార్డ్ చేసిన అతను లాంబోర్ఘిని డ్రైవర్ను నిలదీశాడు.
A #Lamborghini, a fat bank account, and ZERO Humanity
— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025
This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z
ఆ లాంబోర్ఘిని కారు కార్మికులను ఢీ కొట్టడం మాత్రమే కాదు చెట్టును ఢీ కొట్టాక ఆగింది. పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. కారు పుదుచ్చేరి రిజిస్ట్రేషన్తో ఉందని పోలీసులు తేల్చారు. లాంబోర్ఘిని కారు ఎంత ఖరీదైంతో తెలిసే ఉంటుంది. ఈ కారు ఖరీదు మినిమమ్ 3 కోట్ల రూపాయల పైమాటే. ఎవరో బడా బాబుకు సంబంధించిన కారు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.