
కోతి నుంచి మనిషిగా ఎదిగిన మానవ పరిమాణాలకు సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయి..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా మానవులలో మెదడు అభివృద్ధి అభివృద్ధి జరిగిందనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. గత పరిశోధనలను పరిశీలిస్తే..మానవ మెదడు అభివృద్దికి మాంసం తినడం చాలా అవసరం అని చెబుతున్నాయి. అయితే తాజా పరిశోధనల్లో మానవ మెదడు అభివృద్ధికి కావల్సింది మాంసం కాదు..శాఖాహారులైన మన పూర్వీకుల్లో మెదడు అభివృద్ది బాగా జరిగిందని తేలింది. ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
మానవ మెదడు అభివృద్దికి మాంసాహారం కాదు శాఖాహారమే దీనికి సమాధానం పూర్వీకుల దంతాలే అంటున్నారు పరిశోధకులు. దక్షిణాఫ్రికాలోని ఆస్ట్రాలోపిథెకస్ జాతుల శిలాజ దంతాలను పరిశోధకులు పరిశీలనలో ఈ విషయం తేలింది. స్టెర్క్‌ఫోంటెయిన్ గుహలలో సేకరించిన 3.5 మిలియన్ సంవత్సరాల నాటి ఈ శిలాజాలపై పరిశోధనలు చేశారు. ఆహార అలవాట్లను నిర్ణయించడానికి శాస్త్రవేత్తలు ఎనామిల్‌లోని నైట్రోజన్ ఐసోటోపులను అధ్యయనం చేశారు.
సాధారణంగా నైట్రోజన్-14 , నైట్రోజన్-15 మొత్తాలలో సేకరించే విధానంలో వారు ఏం తిన్నారో నిర్ణయించారు. మొక్కలను తినే వాటి కంటే వేటాడే జీవులు నైట్రోజన్-14 ని ఎక్కువగా సేకరిస్తాయి. ఈ ఐసోటోపులను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ప్రారంభ హోమినిన్లు ఎంత మాంసం తిన్నారో అంచనా వేశారు.
ఈ పరిశోధనల్లో ఫలితాలు ప్రారంభ హోమినిన్ల(పూర్వీకులు )లో శాకాహారుల మాదిరిగానే నత్రజని స్థాయిలు ఉన్నాయని వెల్లడించాయి. దీనర్థం వారి ఆహారం ఎక్కువగా మొక్కలపై ఆధారపడి ఉందని , మాంసం వినియోగం తక్కువ అని. అప్పుడప్పుడు మాంసం తినడం తోసిపుచ్చలేమని పరిశోధకులు గుర్తించారు.
మునుపటి అధ్యయనాలు క్రమం తప్పకుండా మాంసం వినియోగం సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైందని సూచిస్తున్నాయి.మాంసం కోయడానికి ఉపయోగించే రాతి పనిముట్లు, కోత గుర్తులు ఉన్న జంతువుల ఎముకలు ఇందుకు ఆధారాలు. కెన్యాలో పురాతనమైన మాంసం కోసే ప్రదేశం 2.9 మిలియన్ సంవత్సరాల నాటిది.
కొత్త పరిశోధనలు పాత అధ్యయనాలను సవాల్ చేస్తున్నాయి. మానవ మెదడు అభివృద్ధికి మాంసం తినడం చాలా అవసరమనే ఆలోచనకు పూర్తి భిన్నంగా ఉంది. 250,000 సంవత్సరాల క్రితం ఉద్భవించిన నియాండర్తల్‌లు ఉన్నత స్థాయి మాంసాహారులు. అయితే ప్రారంభ హోమినిన్‌లు మాంసంపై అంతగా ఆధారపడలేదని ఈ తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. వారి పరిశోధనలు ఆహారం మానవ పరిణామాన్ని ఎలా ప్రభావితం చేసిందనే దానిపై అభిప్రాయాలను తిరిగి రూపొందించగలవని అంటున్నారు.