Sreeleela Dating: శ్రీలీల డేటింగ్ రూమర్స్.. ఆ స్టార్ హీరో తల్లి కన్ఫమ్ చేసేసింది!

Sreeleela Dating: శ్రీలీల డేటింగ్ రూమర్స్.. ఆ స్టార్ హీరో తల్లి కన్ఫమ్ చేసేసింది!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) డేటింగ్ రూమర్స్ జోరందుకున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్తో (Kartik Aaryan)కొంతకాలంగా శ్రీలీల డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్ తల్లి తన కొడుకు శ్రీలీలతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

కార్తీక్ తల్లి మాలా తివారీ తన కొడుకు కార్తీక్ ఆర్యన్తో కలిసి (IIFA అవార్డ్స్ 2025) వేడుకకి వెళ్లారు. ఆ ఈవెంట్లో కార్తీక్ తల్లి మాలా తివారీ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ క్లిప్‌లో, ఆమె కాబోయే కోడలు అంచనాల గురించి కరణ్ జోహార్ అడగగా.. దీనికి మాలా తివారీ  స్పందిస్తూ.. 'కార్తీక్ భార్యగా.. మా ఫ్యామిలీ అంతా 'చాలా మంచి డాక్టర్'ని కోరుకుంటున్నట్లు ఆమె సరదాగా అన్నారు. దాంతో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ రూమర్స్ కన్ఫమ్ అయినట్లు టాక్ మొదలైంది.

అయితే, ఈ వార్తలపై కార్తీక్ కానీ శ్రీలీల కానీ ఇప్పటివరకు తమ మధ్య ఉన్న రిలేషన్ని ఎక్కడ కన్ఫమ్ చేయలేదు. అలా అని ఎక్కడ ఖండించలేదు. ఇటేవలే శ్రీలీల MBBS పట్టా కూడా తీసుకుంది.

ఇదిలా ఉంటే.. రీసెంట్గా శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలసి ఒకే ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తన సోదరి కృతికా తివారీతో కలిసి శ్రీలీల కిస్సిక్‌కి డ్యాన్స్ చేస్తుండగా, కార్తీక్ ఆర్యన్ ఆమె పక్కన నిలబడి తన ఫోన్‌లో ఆ ఈవెంట్‌ను రికార్డ్ చేస్తున్నాడు.

Also Read :- హీరోయిన్ సౌందర్యది హత్యనా..? 22 ఏళ్ల తర్వాత ఖమ్మం పీఎస్ లో ఫిర్యాదు

ఇకపోతే, కార్తీక్ ఆర్యన్ ఇటీవల దీపావళి సూపర్‌హిట్ చిత్రం 'భూల్ భూలైయా 3'లో కనిపించాడు. మరోవైపు, శ్రీలీల పుష్ప 2: ది రూల్‌లోని కిస్సిక్ పాట ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ జంట అనురాగ్ బసు దర్శకత్వంలో 2025 దీపావళికి విడుదల కానున్న ఓ మూవీలో కలిసి నటించనున్నారు.

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో నటించిన రాబిన్ హుడ్ మూవీ  మార్చి 28న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'మాస్ జాతర' తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.