బాలీవుడ్ లవ్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో కొద్ది మంది బంధుమిత్రుల మధ్య డిసెంబర్ 9న వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరు హాజరయ్యారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా విక్కీ - కత్రీనాకు పెళ్లి సందర్భంగా అందిన గిఫ్ట్ లపై ఇంటర్నెట్ లో చర్చ నడుస్తోంది.
కొత్త జంటకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి కాస్ట్లీ గిఫ్ట్ లు అందినట్లు తెలుస్తోంది. కత్రినాకు బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లు కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు సమాచారం. పెళ్లి సందర్భంగా సల్మాన్ ఖాన్ రూ.3 కోట్ల వాల్యూ చేసే రేంజ్ రోవర్ కారును, రణబీర్ కపూర్ రూ.2.7కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారట. అనుష్క శర్మ రూ.6 లక్షల విలువైన డైమండ్ ఇయర్ రింగ్స్, ఆలియా భట్ కాస్ట్లీ పెర్ఫ్యూమ్ బాస్కెట్ బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లక్షన్నర విలువ చేసే పెయింటింగ్, హృతిక్ రోషన్ రూ.3 లక్షల విలువైన బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ బైక్ ను విక్కీకి గిఫ్ట్ గా ఇచ్చారట. విక్కీ కత్రీనాలు హనీమూన్ కోసం యూరప్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విక్కీ ప్లాన్ చేసిన ఈ ట్రిప్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
For more news