Ajith Kumar: అజిత్కు బ్రెయిన్ సర్జరీ!..అసలేమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నిన్న (మార్చి 7న) చెన్నై అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అజిత్ 'విదేశాల్లో షూట్ చేయడానికి వెళ్లే ముందు లేదా తన బైకింగ్ ట్రిప్‌లకు వెళ్లే ముందు రొటీన్ హెల్త్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ మేనేజర్ తెలిపారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..వైద్య పరీక్షల్లో అజిత్ మెదడులో స్వల్ప వాపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 4 గంటలపాటు వైద్యులు ఎంతో శ్రమించి అతని మెదడులోని కణితిని తొలగించారు. అపోలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలో మదురై, కేరళకు చెందిన ప్రఖ్యాత సర్జన్లు అజిత్కు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం. 

ప్రస్తుతం అజిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తమిళ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. అయితే ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే,సర్జరీ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అభిమానులు అజిత్ కుమార్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. 

ALSO READ :- Kannappa First Look: కన్నప్ప నుండి పవర్ఫుల్ ఫస్ట్ లుక్.. చేతిలో విల్లుతో మంచు విష్ణు అదుర్స్

ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి అనే సినిమా చేస్తోన్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.. ఇప్పుడు కొన్ని నెలలు గ్యాప్ తీసుకోబోతున్నాడని సమాచారం..