పాటల కాంట్రవర్సీ: గేమ్ ఛేంజర్ స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌.. తమన్ సంచలన వ్యాఖ్యలు

పాటల కాంట్రవర్సీ: గేమ్ ఛేంజర్ స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌.. తమన్ సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ ఫ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్పై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే తమన్ గేమ్ ఛేంజర్ సినిమా సాంగ్స్ విషయంపై మాట్లాడిన మాటలకు చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

ఆహా వేదికగా వస్తోన్న డ్యాన్స్‌ ఐకాన్‌ 2 షోకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ గెస్ట్గా వచ్చారు. ఆ షోలో కంటెస్టెంట్స్‌ చేస్తున్న డ్యాన్స్‌కు తమన్‌ ఫిదా అయ్యారు. ముఖ్యంగా గేమ్‌ ఛేంజర్‌లోని 'జరగండి జరగండి' సాంగ్‌కు ఒక చిన్నారి వేసిన స్టెప్పులపై తమన్‌ ఇలా కామెంట్‌ చేశారు.

'సినిమాలో ఉన్న స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేశావ్‌.. చాలా గ్రేట్‌, అవకాశం ఉంటే గేమ్ ఛేంజర్లో ఈ స్టెప్స్‌ యాడ్‌ చేయమని కోరుతాను.' అని తమన్ అన్నారు. దాంతో ఇపుడీ ఈ మాటలు మెగా ఫ్యాన్స్కి గుచ్చుకుంటున్నాయి. అంతేకాకుండా, ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సాంగ్స్ ఫెయిల్యూర్‌కు తమన్ చెప్పిన రీజన్ సైతం మెగా ఫ్యాన్స్కి నచ్చట్లేదని తెలుస్తోంది.   

ALSO READ | డ్యాన్స్ పేరుతో మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తే చర్యలు తప్పవు: మహిళా కమిషన్

"గేమ్ ఛేంజర్ సినిమాలో హుక్ స్టెప్స్ లేవు. జరగండి జరగండి, రా మచ్చ, హైరానా సాంగ్స్, దోప్.. ఇలా ఏ సాంగ్స్లో కూడా హుక్ స్టెప్స్ లేవు. డ్యాన్స్ వేసే స్టెప్స్ లేవు. అలవైకుంఠపురంలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కి హుక్ స్టెప్స్ ఉన్నాయి. రాములో రాములా, బుట్టబొమ్మ, సామజవరగమన.. ఇలా అన్ని సాంగ్స్కి హుక్ స్టెప్స్ ఉన్నాయి. డ్యాన్స్ మాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.

హుక్ స్టెప్స్ స్ట్రాంగ్గా లేకపోతే కంటిన్యూగా పాటలు వినలేరు. గేమ్ ఛేంజర్ సాంగ్స్ బాగున్నా రీల్స్ చేసే వాళ్ళు, డ్యాన్స్ చేసే వాళ్లకు హుక్ స్టెప్స్ లేకపోవడంతో ఎక్కువ వ్యూస్ రాలేదు అని అన్నారు. గతంలో తమన్ మాట్లాడిన వీడియో పోస్ట్ చేస్తూ.. 'ప్రభుదేవా మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా జరగండి హుక్ స్టెప్ కి థియేటర్లు దద్దరిల్లాల్ల్సిందే ' అని అన్నావు. ఇప్పుడు అసలు హుక్ స్టెప్పే లేదన్నట్టు మాట్లాడుతున్నావు అంటూ  ఫైర్ అవుతున్నారు. 

ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ తమదైన శైలిలో సీరియస్ అవుతున్నారు. సరిగ్గా ట్యూన్స్ కొట్టకుండా ఇతరులపైకి నెట్టేయడం ఏంటీ అని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. తండేల్ సినిమాలోని సాంగ్స్ హుక్ స్టెప్స్తో మాత్రమే పాపులర్ అవ్వలేదు కదా.. సంగీతంతోనే అయ్యింది కాదా అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమన్ను చరణ్ అన్‌ఫాలో చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

దాంతో మెగా టీం ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అసలు రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యేది చాలా తక్కువ మందిని. కేవలం మెగా ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆయన ఫాలో అయ్యే వారి లిస్టులో ఉన్నట్లు రామ్ చరణ్ మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో వీరిద్దరి మధ్య వస్తోన్న రూమర్స్కి చెక్ చెప్పినట్లు అయింది.

ఇకపోతే డ్యాన్స్‌ ఐకాన్‌ 2 లేటెస్ట్ షో పూర్తి ఎపిసోడ్‌ ఆహాలో మార్చి 21న సాయింత్రం 7గంటలకు స్ట్రీమింగ్‌కు వస్తుంది. ఇంకా తమన్ ఏం మాట్లాడాడో అని అందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళ్లనుందో తెలియాల్సి ఉంది.