టవల్ చుట్టుకుని ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో రైలులో కలియతిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల వింత కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ మెట్రో ప్రజల వింత కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రదర్శిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మోహిత్‌గౌహర్‌లో షేర్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి ఢిల్లీ మెట్రోలో టవల్‌తో చుట్టుకొని ప్రయాణిస్తున్న వీడియో షేర్ చేశారు. అక్కడ ఉన్న ప్రయాణికులు బలవంతంగా నవ్వారు. ఈ వింత వీడియోను లక్షల మంది లైక్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి ఘటనలు ఎక్కడపడితే ఎక్కడ ప్రదర్శిస్తున్నారు.
లైక్‌లు, వ్యూలతో ఆనందం
సోషల్ మీడియా ట్రెండ్ పెరిగిపోవడంతో జనం వెర్రితలలు వేస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ యువకుడు టవల్ చుట్టుకొని ప్రయాణించాడు. ఈ రోజుల్లో ఢిల్లీ మెట్రో ఇలాంటి వింత ఘటనలకు కేంద్రంగా మారింది. రోజూ ఏదో ఒక వింత చేస్తుండడంతో డీఎంఆర్‌సీతోపాటు ప్రయాణికులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. చుట్టుపక్కల జనాల గురించి పట్టించుకోకుండా కనీసం... సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పాటించడం లేదు. జనాలు వాస్తవ ప్రపంచం కంటే వర్చువల్ ప్రపంచంపై ఎక్కువ ఆసక్తిని పొందడం ప్రారంభించారు. అందుకే అతని ముందు జనాలు నవ్వుతుంటారేమో కానీ సోషల్ మీడియాలో అతనికి వచ్చే వ్యూస్, లైక్‌లు ఆనందాన్ని కలిగిస్తాయి.
టవల్ చుట్టుకుని ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో రైలులో కలియతిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహిత్ గుహర్ ఈ వీడియోను షేర్ చేయగా 30 లక్షల మంది వీక్షించారు. వైరల్ వీడియోలో టీషర్ట్, టవల్‌తో ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో కంపార్ట్‌మెంట్లలో తిరుగుతూ ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్టు బిహేవ్ చేయడం కనిపిస్తుంది. పలువురు ప్రయాణీకులు అతడి వైపు అదోలా చూస్తూ నవ్వుకోవడం కనిపించింది. వాటర్ ట్యాంక్ ఖాళీ అయింది..ఈరోజు ఆఫీస్‌లో స్నానం చేస్తా అని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. టవల్‌తో రోడ్డు మీదకు రావడమేంటని పలువురు ఆక్షేపించగా, అతడి బోల్డ్ స్టెప్‌ను మరికొందరు యూజర్లు ప్రశంసించారు.