నిజం ఏంటీ అంటే : తిరుమల లడ్డూ వివాదం.. ఇప్పుడు పాకిస్తాన్ వరకూ వెళ్లింది.. !

తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు పాకిస్తాన్ దేశంలోనూ చర్చనీయాంశం అయ్యింది. అవును.. ఇది నిజం. కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు క్రియేట్ చేయటంతో వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన తిరుమల లడ్డూకు.. పాకిస్తాన్ దేశంతో ఉన్న లింక్ ఏంటీ.. ఇందులో నిజం ఎంత.. జరిగింది ఏంటీ అనేది వివరంగా తెలుసుకుందాం...

సోషల్ మీడియా ప్రచారం :

తిరుమల లడ్డూ ప్రసాదంకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో పని చేసే సిబ్బంది అంతా ముస్లింలు అని.. ఏఆర్ డెయిరీలో పని చేసే ముస్లింలు వీళ్లే అంటూ వాళ్ల పేర్లతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తిరుగుతుంది. ఏఆర్ డెయిరీ కావాలనే ఇలా చేసిందని.. జంతువుల నుంచి వచ్చిన కొవ్వును కుట్ర పూరితంగానే కలిపారు అనేది ఆ ట్విట్ సారాంశం.. 

వాస్తవం ఏంటీ అంటే :

తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యి పంపించింది తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో పని చేసే వాళ్లు అందరూ హిందూవులే. బోర్డు సభ్యులు, డైరెక్టర్లు కూడా.. ఇదే సమయంలో పాకిస్తాన్ లో ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలోని సిబ్బంది, డైరెక్టర్లు అందరూ ముస్లింలు. ఆ బోర్డు సభ్యులను తీసుకొచ్చి.. మన తమిళనాడులో బోర్డు సభ్యుల పేరుతో ప్రచారం చేస్తున్నారు. 
అసలు విషయం ఏంటంటే..
తమిళనాడులో ఉన్న కంపెనీ పేరు ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్
పాకిస్తాన్ లో ఉన్న కంపెనీ పేరు ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్..
తమిళనాడు కంపెనీ పేరులో డెయిరీ అని ఉంటే.. పాకిస్తాన్ కంపెనీ పేరులో డెయిరీ లేదు..
ఇలా.. పాకిస్తాన్ కంపెనీని.. మన తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి లింక్ చేసి.. తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు సోషల్ మీడియాలోని కొందరు నెటిజన్లు.

సో.. తిరుమల లడ్డూ వివాదంలో పాకిస్తాన్ కు అస్సలు సంబంధం లేదు.. సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. దీన్ని ఎవరూ నమ్మొద్దు.. 

ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సిట్ టీం ప్రకటన.. ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు..