హ్యాపీ రాజసం..అంబానీల పెంపుడు కుక్క ప్రయాణించే..కారు ఖ‌రీదు ఎన్ని రూ.కోట్లో తెలుసా?

హ్యాపీ రాజసం..అంబానీల పెంపుడు కుక్క ప్రయాణించే..కారు ఖ‌రీదు ఎన్ని రూ.కోట్లో తెలుసా?

ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో వివిధ దేశాల అధ్యక్షులు, అపార కుబేరులు, సినీ స్టార్స్ ఇలా పలు రంగాలకు చెందిన ఫేమస్ మ్యాన్స్ విచ్చేయడంతో గత ఐదు నెలలుగా సోషల్ మీడియాలో ట్రేండింగ్గా మారింది.

అయితే..తాజాగా అంబానీ ఫ్యామిలీ నుంచి మారో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే..విలాసవంతమైన కార్లలలో అనంత్ అంబానీ వధువు రాధికా మర్చంట్తో పాటు అతడి ఫ్యామిలీతో కలిసి భారీగా అలంకరించిన రోల్స్ రాయిస్ S680 మేబ్యాక్ కార్లలో వేదిక వ‌ద్ద‌కు వచ్చారు. 

అయితే ఇలాంటి రిచ్ స్టేటస్ కేవలం అంబానీల కోసం మాత్ర‌మే కాదండోయ్..వారి గోల్డెన్ రిట్రీవర్  హ్యాపీ (కుక్క‌) కోసం కూడా. ఇది కూడా ఈ విలాసవంతమైన కార్ లో వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చి అందరిని ఆకర్షించింది. అయితే..వారి హ్యాపీ (కుక్క) హ్యాపీ రూ.4 కోట్ల విలువైన విలాసవంతమైన కారులో ప్రయాణిస్తుందని సమాచారం. ఈ హ్యాపీ ప్రయాణించే కారు మెర్సిడెస్ బెంజ్ G 400d ఖరీదు అక్షరాల రూ.4 కోట్లు. 

ప్రస్తుతం అంబానీ ఫ్లీట్‌లో కట్టుదిట్టమైన భద్రత కోసం G 63 AMG వంటి హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో G 400d కారు  ప్రత్యేకంగా హ్యాపీ కోసం కొనుగోలు చేశారు. గతంలో ఈ హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌ను ఉపయోగించుకునేది. కానీ ఇప్పుడు G 400d లో ప్రయాణిస్తూ తన రాజ‌సాన్ని క‌న‌బ‌రుస్తోంది. ఈ పెంపుడు కనిపించింది ఇది మొదటిసారి మాత్రమే కాదు.

గతంలో న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో అనంత్‌తో కలిసి నడుస్తు వైరల్ అయింది. ఈ లక్కీ డాగ్ యొక్క పార్క్ ఔటింగ్‌లలో G-వాగన్‌లో విమానాశ్రయానికి వెళ్లడం, ఆ తర్వాత NYCకి ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కనిపించడం ఇలా పలు సందర్భాల్లో బాగా వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే..ముఖేష్ అంబానీ గడిపే విలాసంతమైన జీవితం కేవలం తన ఫ్యామిలీకే కాదు..నమ్మకంతో పెంచుకునే పెంపుడు జంతువుల మీద కూడా. ఏదేమైనా వారి ప‌ట్ల విశ్వాసంగా ఉన్న జంతువుల‌కు, విశ్వాస‌పాత్రుల‌కు ఇలాంటి ఖ‌రీదైన‌ సౌక‌ర్యాలు ఇవ్వ‌డం త‌ప్పేమీ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..దాని పేరే హ్యాపీ..దాన్ని పనే హ్యాపీ.