Deepika Padukone: దీపిక కట్టిన చీర తయారీకి 3 వేల 400 గంటలు..మరి ధర ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది.

రీసెంట్ గా ప్రభాస్ కల్కి 2898 AD లో నటించిన దీపికా పదుకొణె తాజా ఫోటోషూట్ యొక్క కొన్ని పిక్స్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ ఫోటోలలో దీపికా పర్పుల్ కలర్ చీర ధరించి మెరిసిపోయింది. అయితే, అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క సంగీత పార్టీ నుండి ఈ బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. ఊదా రంగు చీరలో కెమెరా ముందు పోజులిచ్చేటప్పుడు దీపికా తన బేబీ బంప్‌తో కనిపించింది. కాగా..దీపికా ఈ ఫొటోస్ లో కనిపించిన చీర ఏంటో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ వేడుకలో కన్నుల పండుగవలె నిలిచింది. మరి నెటిజన్స్ దృష్టిని అట్ట్రాక్ట్ చేసే అంతటి స్పెషల్ ఏముందో తెలుసుకుందాం.

దీపికా చీర ప్రత్యేకతలు:

దీపికా పదుకొణె ధరించిన ఈ అందమైన పర్పుల్ కలర్ చీర లేబుల్ టోరానీ షెల్ఫ్‌ల నుండి డిజైన్ చేయబడింది. ఈ చీర యొక్క ఫాబ్రిక్ ఆర్గాన్జా మరియు జెన్నీ సిల్క్ చే తయారుచేయబడింది. అంతేకాదు ఈ చీర చేతితో ఎంబ్రాయిడరీ చేయగా..దీని తయారీకి దాదాపు 3,400 గంటలు పట్టింది. మరి ఇన్ని గంటల సమయం అంటే ఓ సారి అర్ధం చేసుకోవొచ్చు. 

ఈ అరుదైన అందమైన చీరలో ముత్యాలు, జరీ మరియు తీగల అలంకరణలు ఎన్నో ఉన్నాయి. ఇవి చీరకు సొగసైన అందాన్ని ఇస్తూ..ఎంతో అట్రాక్షన్ గా నిలిచేలా చేశాయి. అదే సమయంలో, ఈ లుక్‌లో దీపికా పదుకొణె డీప్ నెక్‌లైన్, హాఫ్-లెంగ్త్ స్లీవ్‌లు మరియు కత్తిరించిన హేమ్‌తో మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. అలాగే, ముత్యాలతో చేసిన చోకర్ నెక్లెస్ మరియు దానికి సరిపోయే చెవిపోగులతో దీపికా తన అందంతో రెట్టింపు అట్రాక్షన్ గా నిలిచింది.

దీపికా చీర ధర:

'హుకుమ్ కి రాణి చీర' ధర రూ.1 లక్ష 92 వేలు ఉండగా..ఇందులో చీర ధర చూసుకుంటే, రూ.1,39,500, బ్లౌజ్ రూ.46,500. అండర్ స్కర్ట్ (పెట్టికోట్) ధర 7,500. దీంతో ఇన్ని అలంకారాలు..ఇంత భారీ ధర చీర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: హనుమంతు అమ్మతోడు..నిన్ను వదిలిపెట్టను..మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్

రణ్‌వీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది (2024) సెప్టెంబర్లో తమ తొలి సంతానాన్ని పొందబోతున్నట్లు వాళ్లు మూడు నెలల కిందట సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.