ఎడారి మధ్యలో ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్ .. ఎక్కడో తెలుసా?

ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులకోసం మనం బటయికి వెళ్లినపుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం కామన్ కామన్ అయిపోయింది. నగరాల్లో వాహనాల వాడకంరోజు రోజుకు పెరుగుతూ పోవడమే ఇందుకు కారణమని తెలుసు. అక్కడక్కడా ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి కొంత వాహనాలు జామ్ కాకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు ఇదీ మనకు తెలుసు.. కానీ ఒంటెలకు కూడా ఓ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారు అక్కడ.. ఇది మీకు తెలుసా.. ఒంటెలు ట్రాఫిక్ సిగ్నల్ ఏంటీ అనుకుంటున్నారా.. ఇది నిజం.. రోడ్డు మీద కాకుండా ఎడారి మధ్యలో ట్రాఫిక్  సిగ్నల్ ను ఏర్పాటు చేశారు..ఇది ఎక్కడో ఎడారి దేశంలో కాదు.. మన పక్క దేశం చైనాలో. ఈ ఒంటెల ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు ఏర్పాటు చేశారు దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి... 

వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్‌హువాంగ్ నగరం..ఒంటెల కోసం ట్రాఫిక్ జామ్‌లను కలిగి ఉన్న ఏకైక ప్రదేశం. డన్‌హువాంగ్‌లోని మింగ్‌షా పర్వత ప్రాంతం. దీనిని సింగింగ్ సాండ్ డ్యూన్స్ అని కూడా పిలుస్తారు. ఇది చైనాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే పర్యాటక ప్రాంతం. ఇక్కడ పర్యాటకులకోసం ఒంటెలను ఉపయోగిస్తారు. 

మింగ్ షా పర్వత ప్రాంతంలో నెలవంకను చూసి ఆనందించేందుకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ఒంటెలపై సవారీ చేస్తూ అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ డిమాండ్ తో ఒంటెలు భారీ ఎత్తున ఉపయోగించడం వల్ల అక్కడి ఇబ్బంది ఏర్పడుతోంది. 

ఒంటెలకు ట్రాఫిక్ సిగ్నల్

కొన్ని సంవత్సరాల క్రితం చైనా దీనికి తెలివిగల పరిష్కారంతో ముందుకు వచ్చింది. అదే ఒంటెల కోసం ట్రాఫిక్ లైట్. ఒంటెల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ లైట్‌ వ్యవస్థను  2021 లో ఏర్పాటు చేసింది. 

ఒంటె గుర్తులను కలిగి ఉన్న ఎరుపు, పసుపు ఆకుపచ్చ లైట్లు, సాధారణ ట్రాఫిక్ లైట్ల పనిని నిర్వహిస్తాయి. ఎరుపు అంటే ఒంటెలు ఆగిపోవాలి, ఆకుపచ్చ ఒంటె ఉంటే ముందుకు సాగాలి. ఇలా ఒంటెలకు కోసం ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

డన్‌హువాంగ్ లో చూడదగినవి

డన్‌హువాంగ్ నగరం గన్సు-జిన్‌జియాంగ్ ఎడారి ప్రాంతంలోని ఒయాసిస్‌లో ఉంది. ఇది 1990లలో పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయబడింది. 42 శాతం మంది ఒంటె సవారీలను ఎంచుకున్నారు. ఒక్క 2023లోనే 3.7 మిలియన్లకు పైగా పర్యాటకులు డన్‌హువాంగ్‌ను సందర్శించారంటే ఆ ప్రాంతం ఎంత ఫేమస్సో తెలుస్తోంది. 

స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలు ఒంటెల సవారీలను నిర్వహిస్తారు. వారు యాత్ర కోసం ఒక పర్యాటకుడి నుంచి 100 యువాన్లు (రూ. 1,100) వసూలు చేస్తారు. డన్‌హువాంగ్‌లో 2,000 పైగా ఒంటెలు పర్యాటకుల రవాణాలో భాగమవుతున్నాయి.