అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం: దిడ్డి సుధాకర్ 

ముషీరాబాద్,వెలుగు: అవినీతికి తావులేకుండా ప్రజలకు ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వ నిధులపై హామీ ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని ఆప్ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లిబర్టీ వద్ద ఆప్ రాష్ట్ర ఆఫీసులో సినీనటి హేమ జిల్లోజు పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి స్వాగతించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..

ALSO READ: శివరాత్రిని తలపించిన ఎములాడ

రాష్ట్రంలోని119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆప్ గెలుపు కోసం వ్యూహలు రూపొందించేందుకు ఈనెల 24 న హైదరాబాద్ లో ఆప్ వలంటీర్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా  ముమ్మరంగా  ప్రచారం కొనసాగుతుందని తెలిపారు.  ఆప్ కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎండీ  మజీద్, పాండురంగయ్య, దర్శనం రమేష్, అధికార ప్రతినిధి ప్రవీణ్ యాదవ్, నేతలు సలావుద్దీన్, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.