వాహనదారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. లీటర్ డిజిల్‎పై రూ.2 ధర పెంపు

వాహనదారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. లీటర్ డిజిల్‎పై రూ.2 ధర పెంపు

బెంగుళూరు: వాహనదారులకు కర్నాటక ప్రభుత్వం షాకిచ్చింది. డీజిల్‎పై స్టేట్ ట్యాక్స్‎ను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం డిజిల్‎పై 18.4 శాతం ఉన్న ఉన్న స్టేట్ ట్యాక్స్ 21.17 శాతానికి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్ 1) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కర్ణాటకలో డీజిల్ ధరలు లీటరుకు రూ.2 పెరిగే అవకాశం ఉంది. 

2025, ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కర్నాటకలో లీటర్ డిజిల్ రూ.91.02కి చేరుకుంటుంది. కర్నాటక సర్కార్ 2024 జూన్‏లో కూడా డిజిల్ ధరలను హైక్ చేసింది. అప్పుడు డిజిల్‎పై స్టేట్ ట్యాక్స్‎ను 4 శాతం మేర పెంచింది. దీంతో డీజిల్‌పై 14.3 శాతం ఉన్న స్టేట్ ట్యాక్స్ 18.4 శాతానికి చేరింది. ఏడాది తిరగకుండానే మరోసారి డిజిల్‎పై ధరలు పెంచింది. 

కాగా, కర్నాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పలు ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, పాల ధరలు మెట్రో ఛార్జీల వంటి నిత్యవసరాల ధరలను హైక్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వరుస ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభుత్వం మరింత గుదిబండగా మారుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. 

ALSO READ |Good News: డెలివరీ బాయ్స్‎కు చెన్నై కార్పొరేషన్ అద్భుతమైన ఆఫర్ ఇదే

ఇదిలా ఉంటే.. డిజిల ధరల పెంపుపై అధికారుల వాదన మరోలా ఉంది. కర్ణాటకలో డీజిల్ ధరలు పెంచినప్పటికీ.. పొరుగు రాష్ట్రాల కంటే కూడా మన దగ్గరే తక్కువగా ఉన్నాయంటున్నారు. పక్కా రాష్ట్రాల కన్నా కర్నాటకలోనే డిజిల్, పెట్రోల్‎పై స్టేట్ ట్యాక్స్ తక్కువగా ఉందని వాదిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ ప్రాజెక్టులకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ధరల పెంపు తప్పదని ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నాయి.