డీజిల్ట్యాంక్ లీక్ అయి లారీలు దగ్ధం అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండల కేంద్రానికి డీజిల్ ట్యాంక్‌తో నిండి ఉన్న లారీలు వచ్చాయి. పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలోకి రాగానే రెండు లారీలు అశోక్ లే ల్యాండ్ వాహనాన్ని ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో లారీ డీజిల్ ట్యాంక్ లీక్ అయింది. దీంతో మంటలు చెలరేగాయి.
ఘటనలో రెండు లారీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు. రోడ్డు ఇరుగ్గా ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.