Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..

Good Health:ఇవి తింటే  ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..

ఆరోగ్యం జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.  ఇది సరిగా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి.  తిన్న ఆహారం జీర్ణం అయి  రక్తంలో కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి.  అయితే కొన్ని రకాల ఆహార పదార్దాలను తీసుకుంటే త్వరగా జీర్ణం అయి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.  తిన్న ఆహారం జీర్ణం కాకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం. . .

ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ గుడ్ హెల్త్ కు మంచి పునాది.  తిన్న ఆహారంలో వ్యర్థాలను తొలగించి.. పోషకాలను గ్రహించి శరీరానికి అందజేస్తుంది.  జీర్ణక్రియ సరిగా పనిచేయకపోతే ఆయాసం.. బరువు పెరగడం.. మలబద్దకం తో పాటు మధుమేహం కూడా రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

తినే  ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఉంటే త్వరగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలతో పాటు.. మలబద్దకం కూడా నివారించబడుతుంది.  తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

Also Read :- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం

తిన్న ఆహారం జీర్ణం కాకపోతే శరీరం  డీహైడ్రేషన్ కు గురి కాబడుతుంది.  దీంతో నీరసం.. అల్సర్, ఉబ్బరం లాంటి వ్యాధులు తలెత్తుతాయి.   తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే తగినంత నీరు తాగాలి.  దీంతో ఆహారం సులభంగా ప్రేగుల ద్వారా వెళ్లేలా చేస్తుంది. 

శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి జీర్ణక్రియ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రోబయోటిక్స్ ... గట్ మైక్రోబయోటా జీర్ణక్రియ మెరుగు పరిచేందుకు మంచి బ్యాక్టీరియా.  ఎక్కువ నీరు తాగడం వలన శరీరానికి కావలసిన మంచి బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది.

సాధారణంగా ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకుంటాం.  అప్పుడు ఎక్కువ కంటెంట్ లో తీసుకోవడం వలన జీర్ణక్రియ వ్యవస్థపై బర్డెన్ పడుతుంది.  అలా కాకుండా తినే ఆహారాన్ని డివైడ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఎక్కువ పర్యాయములు తీసుకోవాలి.  దీని వలన త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ వ్యవస్థపై అనవసరమైన ఒత్తిడి ఉండదు.

పంచదార తగ్గించండి..  స్వీట్ పానీయాలు మానేయండి. తేలికపాటి స్నాక్స్ ను తీసుకోండి.  ఇవి ఉబ్బరం.. యాసిడ్ రిఫ్లక్స్..ఇతర జీర్ణసమస్యలసు తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.