నాలుగు రోజులే ఈ ముచ్చట్లు.. తరువాత కొత్తిమీర, కరివేపాకు కట్టలు చేతుల్లో..

నాలుగు రోజులే ఈ ముచ్చట్లు.. తరువాత కొత్తిమీర, కరివేపాకు కట్టలు చేతుల్లో..

వచ్చేసిందమ్మా.. వచ్చేసింది.. ప్రేమికుల అతి పెద్ద పండగ.. ‘వాలెంటైన్స్ డే(Valentine’s Day)’. ఇక ఆగటాల్లేవ్. ప్రపోజ్ చేయాలనుకున్న వారు చేసేయొచ్చు. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వారు.. తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించేయచ్చు. అలా అని ఎవరు ఎదురు పడితే.. వారి చేతుల్లో పువ్వులు పెట్టి.. I Love You అనకండి అబ్బాయిలూ.. కాస్తో కూస్తో అందం, వెనక ఆస్తిపాస్తులు గట్రా ఏమాత్రం ఉన్నాయో ఓ కంట కనిపెట్టండి. ఇదంతా ఎందుకంటారా..! ఇక్కడే ఉంది అసలు కథ.. 

అసలే నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని, బంగారం ధరలు ఆల్ టై గరిష్ట స్థాయికి చేరుకున్న రోజులివి. పెళ్లి కాకముందు మురిపం చేసినట్టు.. పెళ్లయ్యాక మురిపం చేయాలంటే.. మీరైనా కోటీశ్వరులై ఉండాలి లేదా మీరు మనసిచ్చిన వారైనా కోటీశ్వరులై ఉండాలి. ఆహా తరువాత చుస్కుందాంలే అంటే, అక్కడ ఏమీ ఉండదు. అంతా శూన్యం. కోడలు అందంగా లేకున్నా.. ఆస్థి ఏం పట్టుకురాకున్నా.. ఇంట్లో అత్తాకోడళ్ల యుద్ధ సన్నివేశాలు కనిపిస్తుంటాయి. మరోవైపు ఇల్లాలి నుంచి  వారానికో సినిమా, నెలకోసారి షాపింగ్, రెణ్ణెల్లకోసారి అత్తగారిల్లు అన్న డిమాండ్లు ముందుంటాయి. కావున కాస్త అలెర్ట్‪గా ఉండి.. మీ తోడు వెతుక్కోండి. 

ఇంకో ఇంపార్టెంట్ విషయం... 

గులాబీలు, చాకోలెట్లు, టెడ్డిలూ గట్రా ఇవ్వాలనుకుంటే, ఇప్పుడే ఇచ్చేయండి. ఒకవేళ మీది పెళ్లీడు వయసైతే.. వచ్చే ఏడాది నుంచి ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ ఉండవ్. గోంగూర, కొయ్యగూర,  కొత్తిమీర, కరివేపాకు కట్టలు మోయాల్సిందే. ఆహా నేను అటువంటోన్ని కాదు, అన్నీ ఇల్లాలే చూసుకుంటది.. పెళ్ళాన్ని బాగా కంట్రొల్లో పెడతా..! అన్న వెంకటేష్ డైలాగులు వద్దు. అక్కడ వార్ వన్ సైడ్. కంట్రొల్లో పెట్టడాలు.. గట్రా ఏమీ ఉండవ్. అసలే ఈకాలం సతీమణులు మొగుళ్లని చంపటానికి వాడని అస్త్రాల్లేవ్.. వేయని ప్లాన్లు లేవ్.. చూసుకొని మలుచుకోండి. ఆ ఇచ్చేవేవో.. తీసుకునేవేవో ఇప్పుడే కానియ్యండి.