చంద్రయాన్​‑1, చంద్రయాన్​‑2 తేడాలివే

చంద్రయాన్​‑1

2008 అక్టోబర్ 22న పీఎస్ఎల్వీ–సీ11 నౌక ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. భారతదేశం చంద్రునిపైకి ప్రయోగించిన తొలి ఉపగ్రహం. ఇది చంద్రుని ఉపరితల 3డీ చిత్రీకరణ, నీటిజాడలు, ఖనిజ వనరుల గుర్తింపు, చంద్రుని ఆవిర్భావ విషయాలకు ఉద్దేశించింది. చంద్రునిపై నీటి జాడ కనుగొన్న దేశం భారత్​.
ప్రాజెక్ట్​ డైరెక్టర్​: మలయస్వామి అన్నాదురై
ప్రాజెక్ట్​ వ్యయం: రూ.386కోట్లు
చంద్రయాన్​–1 2009, ఆగస్టు 29 వరకు (312 రోజులు) సేవలందించింది. పీఎస్​ఎల్వీ–సీ11 ద్వారా 11 పేలోడ్స్​ను ప్రయోగించారు. వీటిలో 5 భారతదేశానివి. అవి.. టెరియన్​ మ్యాపింగ్​ కెమెరా, హైపర్​ స్పెక్టర్​ ఇమేజర్​, లూనర్​ లేజర్​ రేంజింగ్​ ఇన్​స్ట్రుమెంట్​, హై ఎనర్జీ ఎక్సరే స్పెక్టోమీటర్, మూన్​ ఇంపాక్ట్​ ప్రోబ్​.

ALSO READ :ఇండియాకు బంగ్లా షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చంద్రయాన్​‑2

2019, జులై 22న జీఎస్ఎల్​వీ మార్క్​–3ఎం, రాకెట్​ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. చంద్రునిపై ప్రయోగాలు చేసిన దేశాల్లో భారత్​ నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు దేశాలు రష్యా, అమెరికా, చైనా. చంద్రుడి దక్షిణ ద్రువంలోని చీకటి ప్రదేశంలో నీటి జాడలను గుర్తించడం, చంద్రుడిపైన హీలియం–3తోపాటు ఇంధన వనరులు, ఖనిజాల ఉనికిని గుర్తించడం, భవిష్యత్​లో చంద్రుడిపైన మానవ నివాసానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందించడం, చంద్రుడి ప్రకంపనాలను అక్కడ ఉన్న పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం.
ప్రాజెక్టు డైరెక్టర్​: ముత్తయ్య వనిత
మిషన్​ డైరెక్టర్​: రీతుకరిధాల్
ప్రాజెక్ట్​ వ్యయం: 978 కోట్లు
ఇందులో అమర్చిన ప్రధానమైన పరికరాలు ఆర్బిటర్, ల్యాండర్​(విక్రమ్​), రోవర్​(ప్రజ్ఞాన్) లతోపాటు అమెరికాకు చెందిన పరికరాన్ని అమర్చారు.