Health Tips: ఎండాకాలంలో జలుబుకు .. ఫ్లూ జ్వరానికి తేడా ఇదే..!

Health Tips: ఎండాకాలంలో జలుబుకు .. ఫ్లూ జ్వరానికి తేడా ఇదే..!

కొద్దిగా ఒళ్లు వేడిగా అనిపించినా.. చిన్నపాటి దగ్గు ..జలుబు వచ్చినా జనాలు గాభరా పడుతున్నారు. ఏది ఫ్లూనో.. ఏది జలుబో తెలుసుకోలేక జనాలు భయపడుతున్నారు.  జలుబు లక్షణాలు ఎలా ఉంటాయి.. ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. . . 

ఒంట్లో కొంచెం మార్పు వచ్చినా ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. తుమ్మినా? దగ్గినా? వాటితో ఇబ్బంది పడేవాళ్ల కంటే చుట్టూ ఉండేవాళ్లే ఎక్కువగా భయపడుతున్నారు. సాధారణంగా పేషెంట్స్ తక్కువగా వచ్చే సీజన్ సమ్మర్. అయితే ఇప్పుడు దవాఖానలకు పోయేవాళ్లు పెరిగారు ఫ్లూ లక్షణాతో జలుబు... దగ్గు లాంటి లక్షణాలతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. 

ఫ్లూకి ట్రీట్మెంట్ ఉంది... మెడిసిన్స్ వేసుకోకున్నా వ్యాధి నిరోధక శక్తి తగ్గిస్తుంది. ఫ్లూకి భయపడేదేమీ లేదు.  ఏది సాధారణ జలుబో తెలియదు. ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్లు హైరానా పడిపోతున్నారు. జలుబు, ఫ్లూకి మధ్య ఉండే ఈ తేడాలను తెలుసుకుంటే వచ్చిన సమస్య ఏమిటో అర్థమవుతుంది.

 ఫ్లూ ఉంటే వెంటనే డాక్టర్ని కలిస్తే మూడు వారాల్లో కోలుకుంటారు. కానీ ఈ సమస్యకు కారణం ఏ వైరస్? తెలుసుకోవడానికి తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి. 

జ్వరం  లక్షణాలు

  • జలుబు: ఉండదు 
  • ఫ్లూ : 100 డిగ్రీల ఫారెన్ 
  • హీట్​ 3 నుంచి 5 డిగ్రీలు 

దగ్గు ..గొంతునొప్పి
 

  • జలుబు: సాధారణంగా ఉంటుంది. 
  • ఫ్లూ: సాధారణంగా ఉంటుంది 

ఒంటి నొప్పులు 

  • జలుబు : బాధపెట్టేంత ఉండదు. 
  • ఫ్లూ కొందరిలో మామూలు స్థాయిలో ఉంటే, మరికొందరిలో తీవ్రమైన నొప్పులతో బాధపడతారు. 

ఆయాసం 

  • జలుబు : కొద్దిగా (మైల్డ్) లేదా అంతకన్నా ఎక్కువ (మోడరేట్)గా ఉంటుంది. 

తలనొప్పి 

  • జలుబు : అప్పుడప్పుడూ వస్తుంది. 
  • ఫ్లూ: సాధారణంగా ఉంటుంది. 

ముక్కుకారడం 

  • జలుబు : సాధారణంగా ఉంటుంది. కొద్ది రోజుల్లో పోతుంది. 
  • ఫ్లూ: సాధారణంగా ఉంటుంది. ఎక్కువ కాలం బాధపెడుతుంది. 

కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు 

  • జలుబు : అరుదుగా ఉంటుంది. 
  • ఫ్లూ:  కొన్నిసార్లు ఉంటుంది. ఎక్కువ మంది పిల్లల్లో ఈ సమస్యలు సాధారణంగా ఉంటాయి. 

వణుకు 

  • జలుబు : కొద్దిగా (మైల్డ్ లెవల్) ఉంటుంది. 
  • ఫ్లూ: సాధారణ (మోడరేట్) నుంచి తీవ్ర స్థాయిలో ఉంటుంది.

-–వెలుగు,లైఫ్​–