ప్రభుత్వం పన్నులు వసూలు చేసేందుకు రకరకాల పద్దతులను అనుసరిస్తున్నది. వాటిలో ముఖ్యమైనవి TDS, TCS లు. ఇవి పన్నులు వసూలు చేసే క్రమంలో కీలక పాత్ర పోషిస్తాయి.వీటి ద్వారా వసూలు అయిన మొత్తం ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతుంది. మరీ TDS, TCS అంటే ఏంటీ.. వాటి మధ్య తేడా ఏమిటో తెలుసు కుందాం..
TDS..ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ..TDS అనేది చేసిన చెల్లింపుల నుంచి పన్ను మినహాయింపు. కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నును టీడీఎస్ అంటారు. సాలరీలు, రెంట్లు,పేమెంట్స్, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజు లాంటి పేమెంట్లపై ఈ టీడీఎస్ వర్తిస్తుంది. పన్ను ఎగవేతను నివారించేందుకు, ట్యాక్స్‌ను ముందుగానే చెల్లించేలా చేసేందుకు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
TCS అంటే..
ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS )..ఇది TDS కు విరుద్ధంగా ఉంటుంది.. ఇది కొనుగోలుదారులతో లావాదేవీల సమయంలో విక్రేతలు వసూలు చేసే పన్నును సూచి స్తుంది.వుడ్, స్క్రాప్ లాంటి వస్తువుల అమ్మకాలపై ఈ టీసీఎస్ వర్తిస్తుంది. తయారీ సామగ్రి మినహాయించి ఇతర వస్తువుల అమ్మకాలపై టీసీఎస్ వర్తిస్తుంది.
TDS , TCS మధ్య తేడా ..
TDS అనేది ప్రభుత్వం ఆదాయ వనరు వద్ద నేరుగా పన్ను వసూలు చేసే విధానం. ఈ తగ్గింపు ఆదాయంలో నిర్దిష్ట శాతంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిబంధనల ప్రకారం, వస్తువులు లేదా సేవల కోసం చెల్లింపు నిర్దిష్ట థ్రెషోల్డ్‌ను మించి ఉంటే, చెల్లింపుదారులు ఆదాయ మూలం వద్ద TDSని తీసివేయవలసి ఉంటుంది.
ప్రభుత్వం ప్రతి యేటా వివిధ రకాల వస్తువులు ,సేవలపై TDS కోసం రేట్లు ,లిమిట్ నిర్ణయిస్తుంది. ఈ సేవల్లో రాయల్టీలు, సాంకేతిక సేవలు, లీగల్ ఫీజులు, కన్సల్టింగ్ ఫీజులు, అద్దె ఉంటాయి.
TCS అనేది అమ్మకం సమయంలో విక్రేతలు కొనుగోలుదారుల నుండి వసూలు చేసే పన్ను. ఉత్పత్తి లేదా తయారీ సామగ్రిని మినహాయించి కలప, స్క్రాప్, ఖనిజ కలప వంటి నిర్దిష్ట వస్తువుల విక్రయాలకు ఇది వర్తిస్తుంది. ఒక విక్రేత అటువంటి వస్తువులను కొనుగోలుదారుకు విక్రయించినప్పుడు, వారు కొనుగోలుదారు నుండి కొంత శాతం పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తారు.
పన్నుల విధానంలో..TDS , TCS కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ట్యాక్స్ పేయర్స్ ను ప్రోత్సహించడం, పన్ను ఎగవేత తగ్గించడంతోపాటు పన్నుల సజావుగా వసూలు చేసేలా ఇవి నిర్ధారిస్తాయి.