నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. నిడమనూరు మార్కెట్ ఛైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు చింపుకున్నారు. ఈ రోజు నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటో లేదని పలువురు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఎంపీపీ సామాజిక వర్గం నేతలు ఫ్లెక్సీలు చింపేసినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.