హైదరాబాద్ లో ఏ గల్లీ చూసినా గణనాథుడే దర్శనమిస్తున్నాడు. ఒక్కో చోట ఒక్కో రూపంలో కనువిందు చేస్తున్నాడు. ట్రెండ్ కు తగ్గట్లు వినాయకులను తయారు చేస్తున్నారు.
అయోధ్య కాదు..మన బాలాపూరే..
నగరంలో అందరికీ తెలిసిన బాలాపూర్ గణేశ్ మండపం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్య రాముడి ఆలయ నమూనాలో తీర్చిదిద్దిన ఈ మండపం ఆకట్టుకుంటోంది. బయటి నుంచి చూస్తే అచ్చం అయోధ్య టెంపుల్ లెక్కనే ఉందని భక్తులు కామెంట్ చేస్తున్నారు
పేపర్ స్ట్రాల గణపతి
మల్కాజిగిరి నాచారం బాబాగనర్లో సూర్య శుభకార వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 వేల పేపర్స్ట్రాలతో 10 అడుగుల గణేశుడిని తయారు చేశారు. విగ్రహం బరువు 15 కిలోలు ఉంటుందని, ఇద్దరు వ్యక్తులు 10 రోజుల్లో దీనిని తీర్చిదిద్దారని కమిటీఅధ్యక్షుడు సూర్య ప్రకాశ్ చెప్పారు. 15 ఏండ్లుగా వినూత్నంగా విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు.
Also Read :- క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతాం
చాక్లెట్ గణనాథుడు..
పంజాగుట్ట సోమాజిగూడలోని రూట్స్ కాలేజీఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చెఫ్ వందన, అర్జున్ ఆధ్వర్యంలో 20 మంది విద్యార్థులు చాక్లెట్‌తో గణేశుడిని తయారు చేశారు. మూడు రోజుల పాటు గణపతిని పూజించిన తర్వాత పాలతో నిమజ్జనం చేసి ఆ పాలను అందరికీ ప్రసాదంగా పంపిణీ చేస్తామని ప్రిన్సిపాల్ నిఖిల్ తెలిపారు.
- వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గర ఉలెన్ తో వినాయకుడిని తయారు చేశారు
- చైతన్యపురిలో శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఏర్పాటు చేసిన 31 ఫీట్ల గణపతి
- వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గర పూరీ జగన్నాథుడి అవతారంలో ధర్శనమిస్తున్న డాల్డా వినాయకుడు
- ధూల్ పేట్ లో ఏనుగు రూపంలో ఏర్పాటు చేసిన గణేశ్