ఆధ్యాత్మికం: సమస్యలను.. ఇబ్బందుల వచ్చినప్పుడు ఎలా ఉండాలి..

ఆధ్యాత్మికం:   సమస్యలను.. ఇబ్బందుల వచ్చినప్పుడు ఎలా ఉండాలి..

సమస్యలు లేని జీవి ఉండదు.. అందుకే సీత కష్టాలు.. సీతవి.. పీత కష్టాలు పీతవి అని అంటారు.  ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.  సమస్యలు సృష్టించేది భగవంతుడు కదా.. మరి దానికి పరిష్కారం కూడా ఆయనే చూపుతాడు. ఈ మాత్రం దానికి సమస్యలతో ఇబ్బందులు పెట్టడం ఎందుకు అని మనలో మనకే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి మహర్షులు.. ఆధ్యాత్మిక గ్రంథాలు సూచించిన విధంగా.. గత జన్మలో చేసిన పాప.. పుణ్యాల ఆధారంగా కర్మ అనుభవించి తీరాలి కదా..! అంటారు. అందుకే శ్రీకృష్ణుడికి  నీలాపనిందలు కలగడం.. శ్రీరామచంద్రుడు అడవుల్లో జీవితం గడపడం.. పాండవులు అఙ్ఞాతవాసం.. అరణ్యవాసం చేయడం కూడా వారు చేసిన పాప పుణ్యాల ఆధారంగానే జరిగాయని.. వారు మహానుభావులు.. భగవత్​ స్వరూపులు కావున.. అవి లోకానికి... మానవులకు.. మేలు చేకూర్చేలా జరిగాయి.  

సమస్యలు ఎదురైతే ..సమస్య పరిష్కారానికి మూడు మార్గాలున్నాయని పండితులు చెబుతున్నారు.  ప్రతి మనిషికీ పుట్టింది మొదలు జీవితం ముగిసే వరకు  ఏదో రూపంలో సమస్య లు ఎదురవుతుంటాయి. మానవులు  ఆశించినవన్నీ జరగవు... అలా జరిగితే మనం భగవంతుడిని గుర్తించం కదా.. అందుకే అన్ని వేళలా పరిస్థితులు మనిషికి అనుకూలంగా ఉండవు.  జీవితం ఏ ఒక్క రికీ పూలబాట కాదు.  సమస్య లు, కష్టాలు మనిషి జీవితంలో సర్వ సాధారణం .అవి వచ్చినప్పు డు నిరాశతో కుంగిపోకుండా తన వంతు ప్రయత్నాలు తాను కొనసాగించాలి. 

Also Read:-జీతం ఏముందీ.. కెరీర్ కదా ముఖ్యం.. ఈ తరం ఉద్యోగుల అభిప్రాయం ఇదేనా..!

ఎలాగంటే శిశిర రుతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి.. మరల వసంత రుతువులోచిగురిస్తాయి.  అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టం.. సంతోషకరమైన రోజులుంటాయి. సమస్య లు, కష్టాలు ఎదురైనా వెనకంజ వేయకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగే విధంగా ప్రణాళిక తయారుచేసుకోవాలి.  దీని గురించి ...  ధర్మరాజు ఒక సందర్భం లో భీష్ముడికి చెప్పిన మాటలను పరిశీలిస్తే..  ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి? అని ప్రశ్ని స్తాడు.  సమస్య లు చుట్టుముట్టినా, కష్టాలు ముంచుకొచ్చినా ధైర్యం వీడకుండా ఉండటమే మనిషి ప్రథమ కర్తవ్యం ... సమస్య లను స్థిరచిత్తంతో, మనోధైర్యంతో ఎదుర్కో వాలి. అప్పు డే ప్రతి సమస్య కు ఒక పరిష్కా రం దొరుకుతుందని చెబుతాడు.  

 
 నిజానికి సమస్యలకు అసలు కారణం..  వాటి పట్ల సరైన అవగాహన లేకపోవడమే. ప్రతీ సమస్యను పరిష్క రించడానికి మూడు దారులుం టాయి. ఆమోదించడం ...  మార్చు కోవడం .. వదిలేయడం . సమస్య ను యథాతథం గా ఆమోదించలేకపోతే ... మార్చుకోవాలి. మార్చుకోలేకపోతే వదిలేయాలి. కొంతమంది చిన్న చిన్న  సమస్యలకు కూడా భూతద్దంలో చూసి ఆందోళన చెంది.. చింతాసాగరంలో మునిగిపోతారు. అయితే  దృఢసంకల్పం గల వారు   క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమయస్ఫూర్తిగా  వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో ఎన్ని కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్క రించుకుని తమ ప్రయత్నా లు కొనసాగిస్తారు. చివరికి లక్ష్య శిఖరాలను అందుకుంటారు.   


 జీవితం ఒడుదొడుకులతో కూడిన గంభీర సాగరం ....  ఇందులో ఆటుపోట్లు ఉంటాయి. సంతోష, మాధుర్య స్పర్శలూ ఉం టాయి. అందుకే సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతీ మనిషికి అవసరం . అవగాహన ఉన్న ప్పుడు సమస్య లతోను, కష్టాలతోను కూడా కలిసి నిశ్చలంగా ప్రయాణం చేయగలుగుతాం .  అప్పుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్య లు దూదిపింజల్లా తేలిపోతాయి.      

 ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగిపోవు. తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు కొండలు అడ్డొస్తున్నాయని బెదిరిపోవు.  ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకుని ముందుకు సాగుతాయి. కొమ్మలను నరికేస్తున్నా లోతుగా పాతుకుని ఉన్న వృక్ష మూలాలు తమ ఉనికిని కోల్పోవు. సరికొత్త చిగుళ్లతో నిత్య నూతనంగా ఉంటాయి.ఇలా నిత్యం మౌన సం దేశాలు అందిస్తున్న ప్రకృ తిని గమనిస్తే మనిషికి ఏదీ సమస్య గా అనిపించదు.   శీతోష్ణాలు ప్రకృతిలో ఎలా వస్తూపోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితం లోనూ సుఖదుఃఖాలు వస్తూ పోతుంటాయని చెబుతాడు శ్రీకృ ష్ణుడు. అందుకే మనం పరిస్థితుల్ని అంగీకరిం చాలి. సాహసంతో సమస్య లను ఎదుర్కో వాలి. అవగాహనతో వ్య వహరించి ముందడుగు వేయాలి.