మ్యాన్‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియతో పేషెంట్లకు ఇబ్బందులు

మ్యాన్‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌  ప్రక్రియతో పేషెంట్లకు ఇబ్బందులు
  • ఓపీ వద్ద ఇబ్బంది పడ్డ పేషెంట్లు  

బషీర్ బాగ్, వెలుగు: కోఠిలోని ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు సిటీ నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పేషెంట్లు చికిత్సకు వస్తుంటారు. ముందుగా ఓపీ వద్ద పేరును ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ చేసుకుని చీటీ తీసుకుని డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్తారు. ఇటీవలే మ్యాన్‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌  ప్రక్రియను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో మంగళవారం భారీగా వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయక చవితి కావడం, సెలవు ఉండడంతో భారీగా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఓపీ ప్రారంభమైంది. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ఫింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రింట్​ వివరాలు తీసుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీనికి తోడు ఉదయం 9 గంటల నుంచి సర్వర్ డౌన్ కావడంతో క్యూలైన్‌‌‌‌‌‌‌‌ భారీగా నిలిచిపోయింది.  హాస్పిటల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో  టెక్నికల్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించారు. 

మధ్యాహ్నం వరకు క్యూ లైన్​లో ఉన్న వారికి ఆన్ లైన్​లో ఎంటర్ చేసి ఓపీని అందజేశారు.  పేషెంట్ల హెల్త్ రికార్డును భద్రపరించేందుకే ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొచ్చినట్లు  ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. శంకర్ తెలిపారు. దీంతో కొంత ఆలస్యం అయింది.  పేషెంట్ల వివరాలు ఆన్ లైన్ చేసేటప్పుడు ఆధార్, వేలిముద్ర తీసుకోవాల్సి వస్తుందని ఆ సమయంలో సర్వర్ డౌన్ కావడంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఆరు కౌంటర్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ ఆన్​ లైన్ ప్రాసెస్ చేస్తున్నాం. రద్దీని బట్టి ఇంకా కౌంటర్లను పెంచుతాం.